రకుల్ ప్రీత్ సింగ్‌తో నితిన్ చదరంగం! ప్రియా ప్ర‌కాష్ తోడుగా.. మొత్తానికి సెట్ చేశారు

గత కొంతకాలంగా సరైన హిట్ లేక సతమతమవుతున్నాడు యంగ్ హీరో నితిన్. అయినప్పటికీ ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా తన సినిమాల వేగాన్ని మరింత పెంచేస్తూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది ఒకేసారి మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కేందుకు సిద్దమవుతున్నాడు.

ప్ర‌స్తుతం వెంకీ కుడుముల ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న భీష్మ సినిమాలో నటిస్తున్నాడు నితిన్. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో నితిన్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. దీంతో పాటుగానే వెంకీ అట్లూరితో మరో సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు నితిన్. ఈ సినిమాకు రంగ్ దే అనే టైటిల్ కన్ఫర్మ్ చేసేశారు. అతి త్వరలో ఈ షూటింగ్ సినిమా ప్రారంభం కానుంది.

Nithiin Chandra Sekhar Yeleti movie title fixed

ఇక ఇవిగాక చంద్ర‌శేఖ‌ర్ యేలేటి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేసేందుకు ఓకే చెప్పాడు నితిన్. భవ్య క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై తెరకెక్కనున్న ఈ సినిమాలో నితిన్ సరసన ర‌కుల్ ప్రీత్ సింగ్‌, ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్ హీరోయిన్స్‌గా నటించనున్నారు. యూత్‌కి నచ్చే అన్ని అంశాలతో ట్రై యాంగిల్ లవ్ స్టోరీగా ఈ సినిమా రూపొందనుందని సమాచారం.

ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా టైటిల్ విషయమై ఓ న్యూస్ బయటకు వచ్చింది. కథకు యాప్ట్ అయ్యేలా ఉండేలా ఈ సినిమాకు చ‌ద‌రంగం అనే టైటిల్ పరిశీల‌న‌లో పెట్టినట్లు ఆ వార్త సారాంశం. చిత్రంలో నితిన్ చెస్ ప్లేయ‌ర్‌గా క‌న‌ప‌డ‌తాడ‌ట. వి. ఆనంద‌ప్ర‌సాద్‌ నిర్మాణంలో రూపొందనున్న ఈ సినిమాకు కీరవాణి బాణీలు కట్టనున్నారు. నితిన్ కెరీర్‌కి ఈ సినిమా బాగా ప్లస్ అవుతుందని, నేటితరం యువత కోరుకునే అన్ని అంశాలు మేళవించి ఈ సినిమా రూపొందించనున్నారని టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X