తెలంగాణ అసెంబ్లీ బరిలో నితిన్ ఫ్యామిలీ.. ఎక్కడ నుంచి పోటీ అంటే!

తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో అడుగులేస్తున్న బీజేపీ టాలీవుడ్‌పై పట్టు సాధించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నది. ఆ క్రమంలోనే బీజేపీ రాష్ట్ర నేతలు, అగ్రనాయకత్వం సినీ తరాలతో మంతనాలు జరుపుతున్నది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సినీ తారలను అసెంబ్లీ బరిలోకి దించేందుకు భారీ ప్రణాళికలను రచిస్తున్నది. ఈ క్రమంలో స్టార్ హీరోలతో ముమ్మరం చేసింది. అయితే తాజాగా యువ హీరో నితిన్‌తో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అవ్వడం వెనుక ఓ ఆసక్తికరమైన వార్త సినీ, రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నది. ఈ వార్త వివరాల్లోకి వెళితే..

 ఎన్టీఆర్, నితిన్‌తో భేటి

ఎన్టీఆర్, నితిన్‌తో భేటి

తెలంగాణలో ఇటీవల బీజేపీ అనుసరిస్తున్న వ్యూహాలు రాజకీయ వర్గాలనుఆశ్చర్యానికి గురిచేస్తున్నది. ఎన్టీఆర్, నితిన్ లాంటి హీరోలతో భేటీ కావడం సంచలనం రేపింది. అయితే టీడీపీతో అనుబంధం ఉన్న ఎన్టీఆర్‌ను అగ్రనేత సమావేశం కావడం అనేక ఊహాగానాలు తెరలేపింది. ఓ రకమైన చర్చ జరుగుతుండగా.. వెంటనే నితిన్‌తో భేటీ కావడం మరింత ఆసక్తికరమైన పరిణామంగా మారింది.

నితిన్‌తో భేటీ వెనుక కారణం

నితిన్‌తో భేటీ వెనుక కారణం


RRR సినిమాలో ఉత్తమ ప్రదర్శన చేసినందుకు ఎన్టీఆర్‌ను కలిశారని చెప్పిన బీజేపీ నాయకత్వం నితిన్ భేటి వెనుక కారణం చెప్పలేకపోయింది. అయితే నితిన్ కలవడం వెనుక రాజకీయ కారణాలే ఉన్నాయనే విషయాన్ని సినీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. పక్కా ప్లాన్‌తోనే బీజేపీ స్కెచ్ వేస్తున్నదని చెబుతున్నారు.

నితిన్ ఫ్యామిలీ బీజేపీలోకి

నితిన్ ఫ్యామిలీ బీజేపీలోకి


నితిన్, నడ్డా భేటి వెనుక తాజాగా ఓ వార్త వెలుగులోకి వచ్చింది. నితిన్ తండ్రి, డిస్టిబ్యూటర్, నిర్మాత సుధాకర్ రెడ్డి, సోదరి నిఖితా రెడ్డి రాజకీయాల్లోకి రావడానికి ఆసక్తికరంగా ఉన్నారని, అందుకు బీజీపీ కూడా సానుకూలంగా ఉన్నట్టు సమాచారం. గ్రేటర్ హైదరాబాద్ నుంచి నితిన్ ఫ్యామిలీ టికెట్ ఆశిస్తున్నారని తెలిసింది.

హైదరాబాద్ నుంచి పోటీ

హైదరాబాద్ నుంచి పోటీ


ఇక బీజేపీలోకి త్వరలోనే సుధాకర్ రెడ్డి గానీ, నిఖితా రెడ్డి గాని చేరనున్నారు. హైదరాబాద్ పట్టణంలోని కీలక స్థానం నుంచి పోటీకి నితిన్ ఫ్యామిలీ ఆసక్తి చూపుతున్నారు. అయితే ఈ స్థానానికి పోటీ ఎక్కువగా ఉంది. అందుకే బీజేపీ ఈ విషయంపై ఆచూతూచీ వ్యవహరిస్తున్నదని తెలిసింది.

 నితిన్ విషయానికి వస్తే..

నితిన్ విషయానికి వస్తే..


ఇక నితిన్ విషయానికి వస్తే.. ఇటీవల మాచర్ల నియోజకవర్గం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరుత్సాహపరిచింది. ఈ క్రమంలో నితిన్‌తో నడ్డా సమావేశం కావడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే ఈ వ్యవహారంపై నితిన్ మీడియా ముందు పెదవి విప్పకపోవడం అనేక సందేహాలకు గురిచేస్తున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X