Don't Miss!
- Lifestyle
Today Rasi Phalalu:ఈ రోజు మీ ప్రయత్నాలలో విజయం సాధిస్తారు? మీ రోజువారీ జాతకం చెబుతుంది.
- News
టీఆర్ఎస్కు మును‘గోడు’: కూసుకుంట్లను వ్యతిరేకిస్తూ రచ్చ, ఓటమి ఖాయమంటూ వార్నింగ్
- Sports
లక్నో ఫ్రాంచైజీ గ్రూప్ కొన్న జట్టు తరఫున సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఆడబోయే స్టార్లు వీరే..!
- Finance
Investments: చైనా, తైవాన్లలో పెట్టుబడులు పెట్టిన దేశీయ ఇన్వెస్టర్లకు కన్నీళ్లు.. ఎందుకంటే..
- Travel
దక్షిణ మధ్య రైల్వేలో విస్టాడోమ్ కోచ్‌తో నడిచే మొట్టమొదటి రైలు
- Technology
ఇన్స్టాగ్రామ్ వినియోగదారుల డేటాను ట్రాక్ చేస్తోంది!!
- Automobiles
బ్రేకింగ్ న్యూస్: మారుతి సుజుకి స్విఫ్ట్ సిఎన్జి Swift CNG విడుదల, ధర రూ.7.77 లక్షలు
చిరంజీవి బావగా యూత్ స్టార్ హీరో: భోళా శంకర్‌లో పవన్ కల్యాణ్ ఫ్యాన్ ఊహించని రోల్
రాజకీయాల కోసం సినిమాకు గ్యాప్ ఇచ్చి.. సుదీర్ఘ విరామం తర్వాత 'ఖైదీ నెంబర్ 150'తో రీఎంట్రీ ఇచ్చారు టాలీవుడ్ బడా హీరో మెగాస్టార్ చిరంజీవి. ఇది సూపర్ డూపర్ హిట్ అవడంతో అప్పటి నుంచి ఆయన మరింత ఉత్సాహంతో సినిమాల మీద సినిమాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే రెండేళ్ల క్రితం 'సైరా: నరసింహారెడ్డి'తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఇది ఆశించిన స్థాయిలో ఆడకున్నా.. ఆ వెంటనే 'ఆచార్య' అనే సినిమాను మొదలెట్టారు. ఇది పట్టాలపై ఉండగానే చిరంజీవి.. మరిన్ని ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకున్నారు. అలా ఇప్పుడు ఒకేసారి మూడు నాలుగు చిత్రాలతో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా చిరంజీవి.. తన సినిమాలో మరో తెలుగు హీరోకు అవకాశం ఇచ్చారు. ఆ వివరాలు మీకోసం!

ఆచార్యతో చిరంజీవికి బిగ్ షాక్
మెగాస్టార్ చిరంజీవి ఇటీవలే 'ఆచార్య' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. బడా డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా నటించాడు. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లు నిర్మించాయి. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ సినిమాకు నిరాశే ఎదురైంది. ఫలితంగా దీనికి రూ. 80 కోట్లకు పైగా నష్టాలు వచ్చాయి.
Telugu Indian Idol: విజేతగా వాగ్దేవి.. ప్రైజ్‌మనీతో పాటు చిరంజీవి ఆఫర్.. ఆమె బ్యాగ్రౌండ్ తెలిస్తే!

మూడు మూవీలు... అదే ఫోకస్
'ఆచార్య' షూటింగ్ జరుగుతుండగానే మెగాస్టార్ చిరంజీవి మరికొన్ని ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకున్నాడు. అందులో లూసీఫర్‌కు రీమేక్‌గా వస్తున్న 'గాడ్ ఫాదర్'తో పాటు బాబీ తెరకెక్కిస్తోన్న ఓ చిత్రం ఉన్నాయి. వీటితో పాటు వేదాళంకు రీమేక్‌గా తెరకెక్కనున్న 'భోళా శంకర్' కూడా ఉంది. దీన్ని ఫ్లాప్ డైరెక్టర్‌గా పేరున్న మెహర్ రమేశ్ తీస్తుండడంతో బాగా ఫోకస్ అవుతోంది.

సోదరి సెంటిమెంట్ స్టోరీతోనే
'భోళా శంకర్' మూవీ సోదరి సెంటిమెంట్‌తో ఫుల్ లెంగ్త్ మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. ఈ సినిమాలో చిరంజీవి సోదరిగా మహానటి కీర్తి సురేష్ నటిస్తోంది. ఇందులో తమన్నా భాటియా హీరోయిన్‌గా చేస్తోంది. ఈ సినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు.
హీరోయిన్ హాట్ ఫొటో షేర్ చేసిన వర్మ: ఇలాంటిది నా జీవితంలో చూడలేదంటూ ట్వీట్

స్పీడుగా షూటింగ్.. అప్‌డేట్లు
మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'భోళా శంకర్' మూవీ షూటింగ్ గత ఏడాదే ప్రారంభం అయింది. అప్పటి నుంచి దీన్ని శరవేగంగా జరుపుకుంటూ వచ్చారు. ఇందులో భాగంగానే కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌తో పాటు రెండు మూడు పాటలను కూడా కంప్లీట్ చేపుకున్నారు. అయితే, మధ్యలో చిరంజీవికి కరోనా వైరస్ సోకడంతో దీనికి బ్రేక్ ఇచ్చారు.

ఆగిపోయిందని.. క్లారిటీ ఇచ్చి
క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతోన్న 'భోళా శంకర్' మూవీ షూటింగ్ ఈ మధ్య కాలంలో జరగడం లేదు. దీంతో ఈ సినిమా ఆగిపోయిందని జోరుగా ప్రచారం జరిగింది. దీంతో చిత్ర యూనిట్ దీనిపై స్పందించింది. ఈ మేరకు ఓ ప్రకటనను కూడా విడుదల చేసింది. ఇందులో ఈ మూవీ షూటింగ్‌ను జూన్ మూడో వారం నుంచి పున: ప్రారంభిస్తున్నట్లు స్పష్టం చేసేసింది.
Hyper Aadi: ఫారెన్ బ్యూటీతో హైపర్ ఆది రొమాన్స్.. అందరి ముందే ఆ పని చేయడంతో!

కీర్తి సురేష్ కోసం యూత్ స్టార్
ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'భోళా శంకర్' మూవీలో చిరంజీవి సోదరిగా మహానటి కీర్తి సురేష్ నటిస్తోన్న సంగతి విధితమే. ఇందులో ఆమెకు జోడీగా నటించాల్సిన ఓ యంగ్ హీరో పాత్ర కూడా ఉంది. దీనికి ఎవరిని తీసుకోవాలన్న దానిపై చిత్ర యూనిట్ తర్జనభర్జన పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ రోల్ కోసం యూత్ స్టార్ నితిన్‌ను తీసుకున్నారని తెలిసింది.

పవన్ కల్యాణ్ ఫ్యాన్‌కు ఛాన్స్
'భోళా శంకర్' సినిమాలో కీర్తి సురేష్‌కు జోడీగా నటించే హీరో పాత్ర కోసం చాలా మందిని అనుకున్నా.. నితిన్‌నే ఎంపిక చేసుకున్నారట. అందుకు అనుగుణంగానే అతడు చిరంజీవి బావగా నటించేందుకు వెంటనే గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాడని తెలుస్తోంది. త్వరలోనే ఈ యంగ్ హీరో షూటింగ్‌లో పాల్గొంటాడని అంటున్నారు. దీనిపై అధికారిక ప్రకటన కూడా రాబోతుందని టాక్.