For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Nithiin ‘మాస్ట్రో’ స్ట్రీమింగ్ వాయిదా: కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

    |

    టాలీవుడ్‌లో ఈ మధ్య కాలంలో రీమేక్ మూవీల హవా కనిపిస్తోంది. పలు భాషల్లో విడుదలై ఘన విజయాలను అందుకున్న చిత్రాలను తెలుగులోకి రీమేక్ చేయడానికి దర్శక నిర్మాతలు, హీరోలు ఆసక్తి చూపిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే ఇలా ఎన్నో రకాల జోనర్లలో సినిమాలు రీమేక్ అయ్యాయి. ఇప్పుడు కూడా పలు చిత్రాలు షూటింగ్‌ను జరుపుకుంటున్నాయి. ఇలా బాలీవుడ్ నుంచి తెలుగులోకి రీమేక్ అవుతోన్న చిత్రాల్లో 'మాస్ట్రో' ఒకటి. క్రైమ్ థ్రిల్లర్‌గా సక్సెస్ అయిన 'అంధాధున్'కు రీమేక్‌గా వస్తున్న ఈ సినిమాలో యూత్ స్టార్ నితిన్ హీరోగా నటిస్తున్నాడు.

    ఆరియానాపై అవినాష్ సంచలన వ్యాఖ్యలు: అతడితో అలాంటి పనులు.. తప్పని చెప్పినా వినలేదంటూ!

    గత సంవత్సరం 'భీష్మ'తో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న నితిన్.. ఈ ఏడాది మాత్రం అప్పుడే రెండు ఫ్లాపులను చవి చూశాడు. అందులో ఒకటి విలక్షణ చిత్రాల దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి తెరకెక్కించిన 'చెక్' కాగా.. ఇంకోటి వెంకీ అట్లూరి రూపొందించిన 'రంగ్ దే' మరొకటి. ఎన్నో అంచనాల నడుమ వచ్చిన ఈ మూవీలు అతడికి నిరాశనే మిగిల్చాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు నితిన్ 'మాస్ట్రో' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. విడుదల కావడానికి సిద్ధంగా ఉంది.

    Nithiin Maestro Streaming Postpone to September 17th

    'అంధాధున్' రీమేక్ హక్కులను నితిన్ తీసుకున్న విషయం తెలిసిందే. ఆ వెంటనే దీన్ని పట్టాలపైకి ఎక్కించేశాడు ఈ స్టార్ హీరో. 'మాస్ట్రో' పేరిట రీమేక్ అయిన ఈ చిత్రాన్ని మేర్లపాక గాంధీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాడు. కరోనా వల్ల పలుమార్లు ఆటంకం ఎదురైనా దీన్ని చాలా రోజుల క్రితమే పూర్తి చేశారు. ఆ వెంటనే నిర్మాణానంతర కార్యక్రమాలు కూడా కంప్లీట్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సంస్థ నేరుగా రిలీజ్ చేసేందుకు హక్కులను కొనుగోలు చేసింది. ఇందుకోసం దాదాపు రూ. 32 కోట్లు వెచ్చించినట్లు కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది.

    ఘాటు ఫోజులతో రెచ్చిపోయిన సుస్మితా సేన్: 45 ఏళ్ల వయసులో మరీ ఇంత దారుణంగానా!

    ఇటీవలే 'మాస్ట్రో' మూవీ ట్రైలర్ విడుదలైంది. దీనికి ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఇక, ఈ సినిమా వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 9న స్ట్రీమింగ్ చేయడానికి సదరు ఓటీటీ సంస్థ సన్నాహాలు చేసింది. అయితే, తాజా సమాచారం ప్రకారం.. 'మాస్ట్రో' స్ట్రీమింగ్‌ను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సంస్థ వాయిదా వేయాలని డిసైడ్ అయిందట. అంతేకాదు, దీన్ని మరో వారం తర్వాత అంటే సెప్టెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన ప్రకటన ఈ రెండు మూడు రోజుల్లోనే రాబోతుందనే టాక్ వినిపిస్తోంది.

    రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్‌గా రాబోతున్న 'మాస్ట్రో' చిత్రంలో యూత్ స్టార్ నితిన్ కళ్లు కనిపించని యువకుడిగా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్, పాటకు భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. దీంతో అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఇక, ఈ సినిమాలో నభా నటేష్, తమన్నా భాటియా హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే, యాంకర్ శ్రీముఖి కీలక పాత్రను పోషిస్తోంది. దీన్ని శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై నికితా రెడ్డి, సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్నారు. మహతి స్వర సాగర్ సంగీతం అందించాడు.

    English summary
    Tollywood Youth Star Nithiin Now Doing Maestro Movie Under Merlapaka Gandhi Direction. This Movie Streaming Postpone to September 17th.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X