For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  హీరో నితిన్ పెళ్లి వివరాలు లీక్: అమ్మాయి పేరు.. మ్యారేజ్ డేట్.. వేదిక ఫిక్స్ అయిపోయాయి.!

  By Manoj Kumar P
  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలోని టాలెంటెడ్ హీరోల్లో నితిన్ ఒకడు. చాలా కాలం కిందటే టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ యంగ్ హీరో.. కెరీర్ ఆరంభంలోనే మంచి మంచి విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇదే జోరును కొన్నేళ్ల పాటు చూపించిన నితిన్.. మధ్యలో వరుస పరాజయాలతో ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. ఆ సమయంలో అతడి కెరీర్ ముగిసిందని అంతా అనుకున్నారు.

  ఇలాంటి పరిస్థితుల్లో 'ఇష్క్' సినిమాతో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాడు. దీని తర్వాత వరసగా సినిమాలు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో నితిన్ పెళ్లి చేసుకోబోతున్నాడంటూ వార్తలు వస్తున్నాయి. తాజాగా అతడు చేసుకునే అమ్మాయి పేరుతో పాటు పెళ్లి తేదీ, వేదిక గురించి వివరాలు లీక్ అయ్యాయి. వివరాల్లోకి వెళితే...

  నితిన్ కెరీర్‌లో బిగ్గెస్ హిట్

  నితిన్ కెరీర్‌లో బిగ్గెస్ హిట్

  కెరీర్ కష్టంగా సాగుతున్న సమయంలో నితిన్‌కు ‘ఇష్క్', ‘గుండె జారి గల్లంతయ్యిందే' సినిమాలు ఊరటను ఇచ్చాయి. వీటి తర్వాత అతడు చేసిన పలు చిత్రాలు మళ్లీ నిరాశనే మిగిల్చాయి. ఈ నేపథ్యంలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘అ ఆ'తో అతడు భారీ విజయాన్ని అందుకున్నాడు. ఇది నితిన్ కెరీర్‌లోనే భారీ వసూళ్లను రాబట్టిన చిత్రంగా నిలిచింది.

  హిట్ లేకున్నా తగ్గడం లేదు

  హిట్ లేకున్నా తగ్గడం లేదు

  ‘అ ఆ' తర్వాత నితిన్ నటించిన మూడు సినిమాలు నిరాశనే మిగిల్చాయి. అయినప్పటికీ అతడు ఏమాత్రం తగ్గడం లేదు. వరుసగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. ఈ క్రమంలోనే ‘భీష్మ', ‘రంగ్ దే', ‘చదరంగం' వంటి సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నాడు. ప్రస్తుతం ఈ మూడు సినిమాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఇందులో ‘భీష్మ' విడుదలకు సిద్ధమవుతోంది.

  యాక్టర్‌గానే కాదు.. అలా కూడా

  యాక్టర్‌గానే కాదు.. అలా కూడా

  హీరోగా ఎన్నో సినిమాల్లో నటించిన నితిన్.. నిర్మాతగానూ ముందుకు వెళ్లాలని భావిస్తున్నాడు. ఇందులో భాగంగానే తన చిత్రాలు ‘చిన్నాదానా నీకోసం', ‘గుండె జారి గల్లంతయ్యిందే'కు నిర్మాతగా వ్యవహరించాడు. అలాగే, అక్కినేని వారసుడు అఖిల్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేసే బాధ్యతనూ తీసుకున్నాడు. మొత్తంగా నితిన్‌కు ప్రొడక్షన్ అస్సలు కలిసి రాలేదు.

   నేషనల్ అవార్డు మూవీని కొన్నాడు

  నేషనల్ అవార్డు మూవీని కొన్నాడు

  నిర్మాతగా మరిన్ని చిత్రాలను తెలుగు వాళ్లకు అందించాలన్న పట్టుదలతో ఉన్న నితిన్.. ఈ మధ్య బాలీవుడ్‌లో విడుదలై భారీ విజయాన్ని అందుకున్న ‘అంధాధున్' రీమేక్ హక్కులను కొన్నాడు. శ్రీరామ్ రాఘవన్ తెరకెక్కించిన మూవీలో ఆయుష్మాన్ ఖురానా, రాధికా ఆప్టే, టుబు కీలక పాత్రలు చేశారు. ఈ మూవీకి ఆయుష్మాన్ జాతీయ ఉత్తమ నటుడు అవార్డును అందుకున్నారు.

  హాట్ టాపిక్‌గా నితిన్ ప్రేమాయణం

  హాట్ టాపిక్‌గా నితిన్ ప్రేమాయణం

  ఇక, ఇటీవల హీరో నితిన్ పెళ్లి చేసుకోబోతున్నాడన్న వార్తలు ఇండస్ట్రీతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. అతడు ఓ అమ్మాయితో ప్రేమలో ఉన్నాడని, ఈ ఏడాది పెళ్లి చేసుకోబోతున్నాడని కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఆ అమ్మాయి ఇండస్ట్రీకి చెందిన ఆమె కాదని అంటున్నారు. అయితే, పూర్తి వివరాలు మాత్రం బయటకు రాలేదు.

  హీరో నితిన్ పెళ్లి వివరాలు లీక్

  హీరో నితిన్ పెళ్లి వివరాలు లీక్

  తాజాగా నితిన్ పెళ్లి వివరాలు లీక్ అయ్యాయి. వాటి ప్రకారం.. అతడు షాలినీ అనే అమ్మాయితోనే ప్రేమలో ఉన్నాడట. ఆమె లండన్‌లో ఎంబీఏ పూర్తి చేశారని తెలుస్తోంది. వీళ్లిద్దరి వివాహం దుబాయ్‌లోని ఓ హోటల్‌లో ఏప్రిల్ 16న జరగనుందట. అక్కడే సంగీత్ కూడా ఉంటుందని అంటున్నారు. అయితే, కొద్ది రోజుల తర్వాత హైదరాబాద్‌లో గ్రాండ్‌గా రిసెప్షన్ జరగనుందని సమాచారం.

  English summary
  Nithiin is an Indian film actor and producer known for his works predominantly in Telugu cinema. He is the son of noted Tollywood producer and film distributor Sudhakar Reddy. Nithiin made his film debut in the year 2002 with Jayam, for which he received the Filmfare Award for Best Male Debut South.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more
  X