నితిన్, రానా, నారా రోహిత్ మల్టీస్టారర్.. లేటేస్ట్ హాట్ డైరెక్టర్‌తో..

By Rajababu

Recommended Video

నితిన్, రానా, నారా రోహిత్ మల్టీస్టారర్.. ! | Filmibeat Telugu

జాతీయ అవార్డు గ్రహీత, దర్శకుడు ప్రవీణ్ సత్తారు వరుస సక్సెస్‌లతో దూసుకెళ్తున్నాడు. కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌ చిత్రం పీఎస్వీ గరుడ వేగతో ఘనవిజయాన్ని అందుకొన్న ప్రవీణ్ మరో భారీ బడ్జెట్ చిత్రానికి కసరత్తు చేస్తున్నారు. ఈ చిత్రం మల్టీస్టారర్ చిత్రం కావడం విశేషం. ఈ చిత్రంలో ఇద్దరు కాదు.. ముగ్గురు తెలుగు క్రేజీ హీరోలు నటించడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఆ ముగ్గురు హీరోలు ఎవరంటే..

 నితిన్‌తో సినిమాలో ...

నితిన్‌తో సినిమాలో ...

గరుడ వేగ తర్వాత తాను హీరో నితిన్‌తో సినిమా చేస్తున్నట్టు ప్రవీణ్ సత్తారు వెల్లడించారు. అలాగే ప్రవీణ్ సత్తారుతో తాను సినిమా చేస్తున్నట్టు నితిన్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ప్రవీణ్ సత్తారు. నితిన్ సినిమా కన్ఫర్మ్ అని మీడియాలో కథనం రాగానే ఆ చిత్రం మల్టీ‌స్టారర్ చిత్రమనే విషయం వెలుగులోకి వచ్చింది. ప్రవీణ్ సత్తారు రూపొందించే సినిమాలో ముగ్గురు హీరోలకు స్కోప్ ఉంది అనే తెలిసింది.

 ముగ్గురు హీరోల కథతో

ముగ్గురు హీరోల కథతో

ప్రవీణ్ సత్తారు సినిమాలో నితిన్‌తో పాటు రానా ఓ మఖ్యమైన పాత్రలో నటించనున్నారు. అంతేకాకుండా ఈ చిత్రంలో మూడో హీరో కూడా ఉంటారు. ఆ పాత్ర కోసం నారా రోహిత్‌తో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇంకా చర్చల దశలోనే ఉన్నందున హీరోలు ఖరారు కాలేదు అని చిత్ర యూనిట్ పేర్కొంటున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడించారు.

 మల్టీస్టారర్‌కు రానా సై

మల్టీస్టారర్‌కు రానా సై

ఒకవేళ రానా దగ్గుబాటి ఈ చిత్రంలో నటిస్తే టాలీవుడ్‌లో సెన్సేషనల్ మల్టీస్టారర్‌గా మారడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే రానా ఇప్పుడు దేశంలోనే గొప్ప స్టార్లలో ఒకరు. ఆయన చేస్తున్న చిత్రాలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. రానా ప్రస్తుతం 1945, మహారాజా ఆఫ్ ట్రావంకోర్ చిత్రాలలో నటిస్తున్నారు. అలాగే హిందీ చిత్రం హాథీ మేరా సాథీ చిత్రంలో కూడా నటిస్తున్నట్టు ఇటీవల ట్వీట్ కూడా చేశారు.

 నారా రోహిత్ కూడా ఒకే

నారా రోహిత్ కూడా ఒకే

అలాగే నారా రోహిత్‌కు కూడా మల్టీస్టారర్ చిత్రాలు కొత్తేమీ కాదు. ఈ మధ్యనే ఆది, సుధీర్, సందీప్ కిషన్‌తో కలిసి శమంతకమణి చిత్రంలో నటించాడు. సోలో హీరోగా చేసిన బాలకృష్ణుడు ఇటీవల విడుదలై బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది. ప్రయోగాలు చేయడం నారా రోహిత్ అలవాటే కాబట్టి.. మల్టీస్టారర్ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంటుంది అని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

ప్రవీణ్‌ సత్తారుకు కొత్తేమీ కాదు

ప్రవీణ్‌ సత్తారుకు కొత్తేమీ కాదు

ప్రవీణ్ సత్తారుకు మల్టీ స్టారర్ చిత్రాలను రూపొందించడం కొత్తేమీ కాదు. గతంలో చందమామ కథలు, గుంటూరు టాకీస్ లాంటి మల్టీస్టారర్ చిత్రాలను రూపొందించడమే కాదు.. సక్సెస్ కూడా సాధించాడు. గరుడవేగ లాంటి భారీ బడ్జెట్ చిత్రాన్ని ఒంటి చేత్తో ముందుకు తీసుకెళ్లాడు. ఈ చిత్రాలతో ప్రవీణ్ సత్తా ఏంటో అర్ధమైంది. అందుకే ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో పనిచేయడానికి పలువురు హీరోలు ఆసక్తి చూపుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X