For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పూరీ ‘హార్ట్ ఎటాక్' లో హీరోయిన్ ఈమే...

    By Srikanya
    |
    హైదరాబాద్ : నితిన్, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కబోతున్న 'హార్ట్ ఎటాక్' చిత్రంలో హీరోయిన్ ఖరారైంది. బాలీవుడ్ భామ ఆద శర్మని హీరోయిన్ గా ఎంపిక చేసారు. ఈమె ఫిర్,1920 చిత్రాలు చేసింది. నితిన్ కి ఆమె కరెక్టు పెయిర్ అని ఫోటో షూట్ చేసి పూరి ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కనుందని తెలుస్తోంది. షూటింగుకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 30న సినిమా షూటింగ్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈచిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

    వైష్ణో అకాడమీ పతాకంపై స్వీయ నిర్మాణ దర్శకత్వంలో ఈచిత్రాన్ని పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్నారు. పూరి దర్శకత్వం కావడంతో నితిన్‌ను మరో మెట్టు పైకి తీసుకెళ్లే విధంగా సినిమా ఉండనుందని స్పష్టం అవుతోంది. త్వరలో ఈచిత్రంలో హీరోయిన్ వివరాలతో పాటు సాంకేతిక విభాగం వివరాలు వెల్లడికానున్నాయి.

    షూటింగ్ మొదలైన తర్వాత గోవా, యూరఫ్‌లలో భారీ షెడ్యూల్ జరిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేసారు. ఇక్కడ సినిమా ప్రధాన తారగణంపై కీలకమైన సన్నివేశాలు తెరకెక్కించనున్నారు. హీరోలను సరికొత్తగా ప్రజెంట్ చేసే పూరి నితిన్ ను కొత్త స్టైల్ లో ప్రేక్షకులకు చూపించబోతున్నాడు.

    సినిమా గురించి నితిన్ మాట్లాడుతూ 'పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటించాలనే కోరిక ఎప్పటి నుండో ఉంది. ఇప్పటికి ఆ కోరిక నెరవేరబోతోంది. పూరిగారు కథ చెప్పగానే ఎప్పుడెప్పుడు ఈ షూటింగ్ మొదలవుతుందా అని ఆసక్తి నాలో మొదలైంది. ఈ సినిమా నా కెరీర్‌కు ఎంత ముఖ్యమైనదిగా భావిస్తున్నాను' అన్నారు. ప్రస్తుతం నితిన్ 'కొరియర్ బాయ్ కళ్యాణ్' మూవీ షూటింగులో బిజీగా ఉన్నారు.

    గుండె జారి గల్లంతయ్యిందే చిత్రం ఘన విజయంతో నితిన్ కు వరస ఆఫర్స్ వచ్చి పడుతున్నాయి. ప్రస్తుతం నితిన్ 'కొరియర్ బాయ్ కళ్యాణ్' చిత్రం షూటింగులో బిజీగా గడుపుతున్నాడు. గౌతం మీనన్ నిర్మిస్తున్న ఈచిత్రానికి ప్రేమ్ సాయి దర్శకత్వం వహిస్తున్నారు. యామి గౌతం నితిన్ సరసన హీరోయిన్ గా చేస్తోంది. కార్తీక్ ఈచిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

    ఈ సినిమాల తర్వాత మరో రెండు ప్రాజెక్టులు నితిన్‌కు ఖరారయ్యాయి. అందులో కిక్ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్వకత్వంలో రూపొందబోయే సినిమా ఒకటి కాగా, మరొకటి అలా మొదలైంది, జబర్దస్త్ చిత్రాల ఫేం నందినీరెడ్డి దర్శకత్వంలో చేయనున్నారు. ఈ చిత్రాలు 2014లో సెట్స్ పైకి వెళ్లనున్నాయి.

    English summary
    Nithiin will romance Bollywood actress Adah Sharma in Puri Jagan’s ‘Heart Attack’. This film is expected to be a romantic entertainer and regular shooting will begin from the 30th of this month.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X