నితిన్ 'భీష్మ'లో హైలైట్ అయ్యేది అదే..! మొత్తానికి విషయం బయటకొచ్చిందిగా..

జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలకు కమిట్ అవుతున్న నితిన్.. ఈ ఏడాది వరుస సినిమాలకు కమిట్ అయ్యాడు. అందులో ఒకటే 'భీష్మ'. వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నితిన్ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. మహతి స్వరసాగర్‌ సంగీతం అందిస్తున్నారు. అతి త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన అన్ని అప్‌డేట్స్ ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించాయి. భీష్మ అప్‌డేట్స్ చూసి ఈ సారి నితిన్ కెరీర్‌లో భారీ బ్లాక్ బస్టర్ పడనుందని చెప్పుకుంటున్నారు జనం. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర విషయం బయటకొచ్చింది. భీష్మలో కామెడీ ట్రాక్‌కి పెద్ద పీట వేశారని అంటున్నారు. చిత్రం మొత్తం కూడా కడుపుబ్బా నవ్వించే కామెడీ ఉంటుందని సమాచారం.

Nithiins Bhishma movie Interesting Update

ఇక ఈ చిత్రంలో పరిమళగా వెన్నెల కిషోర్ నటిస్తున్నాడు. వెన్నెల కిషోర్, నితిన్ మధ్య వచ్చే కామెడీ సీన్స్ థియేటర్స్‌ని నవ్వులతో హోరెత్తిస్తాయట. హ్యాండ్సమ్ అండ్ క్యూట్ బాయ్ వెన్నెల కిషోర్‌తో మొదటి సారి నటిస్తున్నందుకు ఆనందంగా ఉందని గతంలో నితిన్ కూడా ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు ఈ చిత్రంలో హెబ్బా పటేల్ రోల్ హైలైట్ కానుందనే సమాచారం వైరల్ అవుతోంది. ఈ సినిమాతో.. ఆమె లేడీ విలన్‌గా ఓ సరికొత్త ప్రయోగం చేస్తోందట. సో ఇదంతా చూస్తుంటే నితిన్ భీష్మ బాక్సాఫీస్ బద్దలు కొట్టడం ఖాయమే అనిపిస్తోంది కదూ!.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X