నితిన్ 'రంగ్ దే' అప్‌డేట్: రిలీజ్ డేట్ ఫిక్స్..!
భీష్మ సినిమాతో 2020 కి ఘన స్వాగతం పలికిన నితిన్.. ఆ తర్వాత ఫుల్ బిజీ అయిపోయాడు. ఓ వైపు పెళ్లిపనుల్లో బిజీగా ఉంటూనే.. వరుస సినిమాల షూటింగ్స్‌లో పాల్గొంటున్నాడు. పరిస్థితి చూస్తుంటే ఈ ఏడాదంతా నిత్యం నితిన్ వార్తలతో సోషల్ మీడియా హోరెత్తిపోతుందని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలోనే హోళీ పండగను పురస్కరించుకొని తన లేటెస్ట్ మూవీ 'రంగ్ దే' చిత్ర యూనిట్ తో దిగిన పిక్ షేర్ చేసిన నితిన్.. మరోసారి అందరి దృష్టినీ తన వైపు లాక్కున్నాడు. ఇకపై 'రంగ్ దే'కి సంబంధించి రెగ్యులర్ అప్‌డేట్స్ ఇస్తామని తెలిపారు నితిన్. ఈ మేరకు తాజాగా అందిన సమాచారం మేరకు ఈ మూవీని జులై 30 వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది.

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వంవహిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నితిన్ కెరీర్‌లో 29వ సినిమాగా రాబోతున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ కలర్ ఫుల్ లవ్ స్టోరీ కోసం నితిన్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.


Click it and Unblock the Notifications











