twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నితిన్ పెళ్లిపై కరోనా ఎఫెక్ట్.. ఇదెక్కడి గోలరా బాబు!! పరిస్థితి చూస్తుంటే..

    |

    ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్ నితిన్ పెళ్లిపై కూడా ఎఫెక్ట్ చూపుతోందని సమాచారం. కరోనా కారణంగా ఇప్పటికే 3000 పైచిలుకు జనం మరణించడం, ఈ వైరస్ వేగంగా వ్యాప్తిచెందుతుండటం కారణంగా ఇప్పటికే పలు సినిమా షూటింగులు వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలోనే నితిన్ పెళ్లి వేడుక విషయమై కూడా సందిగ్దత నెలకొందని తాజా సమాచారం. వివరాల్లోకి పోతే..

    షాలినితో నితిన్ నిశ్చితార్థం

    షాలినితో నితిన్ నిశ్చితార్థం

    యంగ్ హీరో నితిన్ అతిత్వరలో పెళ్లి పీటలెక్కనున్న సంగతి తెలిసిందే. తాను ప్రేమించిన షాలినినే ఆతను పెళ్లాడబోతున్నాడు. సుదీర్ఘకాలం పాటు సాగిన తమ ప్రేమ బంధాన్ని పెళ్లితో మరింత పటిష్టం చేయబోతున్నాడు. ఇటీవలే ఈ ఇద్దరి నిశ్చితార్థం కూడా జరిగింది. అందుకు సంబంధించిన పిక్స్ నెట్టింట వైరల్ అయ్యాయి.

    రహస్యంగా ప్రేమాయణం.. చివరకు ఇలా!

    రహస్యంగా ప్రేమాయణం.. చివరకు ఇలా!

    షాలిని రెడ్డి- నితిన్ గత కొన్నేళ్లుగా ప్రేమలో మునిగి తేలుతున్నారు. కానీ ఈ విషయం బయటకు మాత్రం రాలేదు. ఏ మాత్రం సమాచారం బయటకు తెలియకుండా రహస్యంగా ప్రేమాయణం నడిపించిన నితిన్.. పెద్దలను ఒప్పించాకే అసలు విషయం బయటపెట్టాడు.

    దుబాయ్‌లో పెళ్లి.. కానీ సీన్ రివర్స్

    దుబాయ్‌లో పెళ్లి.. కానీ సీన్ రివర్స్

    ఇటీవలే శాలినితో నిశ్చితార్థం చేసుకొని ఏప్రిల్‌ 16న దుబాయ్‌లోని హోటల్ పలాజో వర్సాచీలో వివాహ బంధంతో ఒక్కటి కానున్నామని ప్రకటించాడు నితిన్. అయితే కరోనా వైరస్ విస్తరిస్తున్న కారణంగా ఈ పెళ్లి వాయిదా పడిందనేది తాజా సమాచారం.

    నితిన్ పెళ్ళి వాయిదా.. అదే జరిగితే

    నితిన్ పెళ్ళి వాయిదా.. అదే జరిగితే

    కరోనా వైరస్‌ ఎఫెక్ట్‌తో అరబ్‌ దేశాల్లో కఠినమైన ఆంక్షలు విధించారు. ఈ నేపథ్యంలో నితిన్ పెళ్ళి కొద్ది రోజుల పాటు వాయిదా పడొచ్చని తెలుస్తోంది. ఒకవేళ అలా కాదంటే అనుకున్న ముహూర్తానికే దుబాయ్ లో కాకుండా హైదరాబాద్‌లోని ఫాం హౌజ్‌లో నితిన్ వివాహం జరిపేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు టాక్.

    Recommended Video

    Bheeshma Success Meet | Filmibeat Telugu
    భీష్మ జోష్.. నితిన్ స్టెప్స్

    భీష్మ జోష్.. నితిన్ స్టెప్స్

    ఇకపోతే ఇటీవలే నితిన్- రష్మిక మందన్న జోడీగా వచ్చిన 'భీష్మ' సినిమా బ్లాక్ బస్టర్ సాధించింది. వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 21న విడుదలై నితిన్ కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలిచింది. పెళ్లి ఏర్పాట్లతో బిజీగా ఉంటూనే తన తదుపరి సినిమాల షూటింగుల్లో పాల్గొంటున్నాడు నితిన్.

    English summary
    Young hero Nithiin - Shalini marriage engaged recently. As per latest talk his marriage is postponed some time.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X