Don't Miss!
- News రఘుబాబు కారు ఢీకొని బీఆర్ఎస్ నేత మృతి
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
రష్మిక, హెబ్బా పటేల్ మధ్య నితిన్ పాట్లు.. ఇదీ అసలు సంగతి!
ఈ ఏడాది యంగ్ హీరో నితిన్ జోష్ మామూలుగా ఉండేలా లేదు. ఏకంగా నాలుగు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు కాబట్టి ఈ ఏడాది బాక్స్ ఆఫీస్ బోనాంజాల్లో నితిన్ స్థానం దక్కించుకుంటాడని చెప్పుకోవచ్చు. కాగా నితిన్ చేస్తున్న ఈ నాలుగు ప్రాజెక్టులలో ఒకటి 'భీష్మ'. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై వెంకీ కుడుముల దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో నితిన్ సరసన రష్మిక మందన్న నటించనుంది. సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా మహతి స్వరసాగర్ సంగీతం అందించనున్నాడు. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబందించిన ఓ వార్త ఆసక్తి రేపుతోంది.
కథలో భాగంగా భీష్మ సినిమాలో మరో హీరోయిన్‌కి కూడా ఛాన్స్ ఉందట. ఇప్పటికే రష్మిక కన్ఫర్మ్ అయింది కాబట్టి మరో హాట్ భామ కోసం వెతికిన చిత్రయూనిట్ హెబ్బా పటేల్ వైపు మొగ్గిందని తెలుస్తోంది. ఈ మేరకు హెబ్బాను సంప్రదించగా ఆమె కూడా ఓకే చేసిందని అంటున్నారు. పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ నటనకు ఆస్కారం ఉన్నందున ఆమె సంతకం చేసినట్లు తెలుస్తోంది. కాగా చిత్రంలో కొన్ని సన్నివేశాల్లో హెబ్బా, రష్మికల నడుమ హీరో నితిన్ నలిగిపోయే సందర్భాలు హైలైట్ అవుతాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా సెట్స్ పై హెబ్బాపటేల్ చేరిందనే టాక్ కూడా వినిపిస్తోంది. ఈ సినిమా కోసం హెబ్బా స్లిమ్ లుక్ లోకి మారిందని అంటున్నారు.
ఇక ఇటీవలే భీష్మ నుంచి వదిలిన నితిన్ లుక్ చూస్తుంటే ఈ సినిమాలో ఆయనది సాఫ్ట్ క్యారెక్టర్ అని తెలుస్తోంది. ఫీల్ గుడ్ కథాంశంతో భీష్మ ప్రేక్షకుల ముందుకు రానుందని అర్థమవుతోంది. చిత్రంలో వెన్నెల కిషోర్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ ఏడాది డిసెంబర్ నెలలో భీష్మ చిత్రాన్ని విడుడల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు.