భీష్మపై ఆసక్తికరమైన వార్త.. స్టోరీ అదేనంటూ సోషల్ మీడియాలో వైరల్
ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే లాంటి సినిమాలతో కెరీర్‌ను గాడిలో పెట్టుకున్న నితిన్.. మళ్లీ పట్టు తప్పాడు. అఆ సినిమా తరువాత మరో హిట్ కొట్టలేక రేసులో వెనుకబడిపోయాడు.ఎన్నో అంచనాలతో వచ్చిన లై, ఛల్ మోహనరంగ లాంటి సినిమాలు బెడిసి కొట్టాయి. అయితే ఈసారి మాత్రం ఎలాగైనా హిట్ కొట్టాలని డిఫరెంట్ ప్రాజెక్ట్‌లను ఎంచుకుంటున్నాడు.
నితిన్ ప్రస్తుతం వెంకీ కుడుముల దర్శకత్వంలో రాబోతోన్న భీష్మ, వెంకీ అట్లూరితో రంగ్ దే చిత్రాన్ని చేస్తున్నాడు. భీష్మ చిత్రం నుంచి ఇప్పటికే రిలీజైన గ్లింప్సెస్‌తో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. రష్మిక, నితిన్‌ల కెమెస్ట్రీ ఈ చిత్రానికి హైలెట్‌గా నిలుస్తుందని పోస్టర్స్ చూస్తేనే అర్థమవుతోంది. తాజాగా ఈ మూవీ గురించి ఓ వార్త హల్ చల్ చేస్తోంది. భీష్మ స్టోరీ ఇదేనంటూ రూమర్లు వినిపిస్తున్నాయి.

ఓ కంపెనీ యజమాని నితిన్‌కు హెల్ప్ చేస్తాడని, తన కంపెనీలో ఉద్యోగం కూడా ఇస్తాడని అయితే ఒకానొక సందర్భంలో కంపెనీ, ఆ యజమాని చిక్కుల్లో పడతారని వాటిని రక్షించేందుకు హీరో చేసిన ప్రయ్నతమే ఈ మూవీ కథ అని వార్త చక్కర్లు కొడుతుంది. ఛలోతో మంచి హిట్ కొట్టిన వెంకీ కుడుముల ఈ చిత్రాన్ని కూడా అదే స్థాయిలో చిత్రీకరించే పనిలో ఉన్నాడు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తుండగా.. మహతి స్వర సాగర్ సంగీతాన్ని అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











