నితిన్ ఆశలన్నీ ఆ సినిమా పైనే, ఈసారి విజయం సాధిస్తాడా?
నితిన్, రాశీ ఖన్నా జంటగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రం 'శ్రీనివాస కళ్యాణం'. తాజాగా ఈ సినిమా షూటింగ్ పంజాబ్‌లోని పటియాలాలో జరుగుతోంది. చండీఘడ్‌లో ఈ సినిమా షూటింగ్ కొంతవరుకు పూర్తి అయ్యింది. తక్కువ వర్కింగ్ డేస్ లో సినిమాను పూర్తి చెయ్యనున్నారు దర్శకుడు సతీష్ వేగ్నేష్.
ఇందులో రాశీఖన్నా, నందితా శ్వేత కథానాయికలుగా నటిస్తున్నారు. 'దిల్' మూవీ హీరో నితిన్‌తో మళ్లీ 14 సంవత్సరాల తరువాత దిల్ రాజు ఈ సినిమాను రూపొందిస్తున్నారు. మిక్కి జే మేయర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను జూలై 24నరిలీజ్ చేయాలని నిర్మాత దిల్ రాజు ప్లాన్ చేస్తున్నాడు.

ఫ్యామిలి ఎంటర్టైనర్ గా తెరకేక్కబోతున్న ఈ సినిమా పై నితిన్ఆసలు పెట్టుకున్నాడు. తాజాగా ఈ హీరో నటించిన చల్ మోహన్ రంగ సినిమా అంతకముందు వచ్చిన లై సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. ఈ సినిమా ఎలా ఉండబోతోందో చూడాలి.


Click it and Unblock the Notifications











