twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'రాక్షసన్'.. ఉత్కంఠ రేపుతున్న నితిన్ నిర్ణయం!

    |

    యంగ్ హీరో నితిన్ ఇష్క్ చిత్రానికి ముందు వరకు చాలా గడ్డు పరిస్థితిని ఎదుర్కొన్నాడు. కెరీర్ ఆరంభంలో వరుస విజయాలతో దూసుకుపోయిన నితిన్ ఆ తరువాత పదేళ్ల పాటు ఒక్క విజయానికి కూడా నోచుకోలేదు. ఇష్క్ చిత్రంతో గోడకు కొట్టిన బంతిలా దూసుకువచ్చాడు. వరుసగా హిట్లు పడ్డాయి. స్టార్ హీరో అనిపించుకోవడానికి అవసరమైన మార్కెట్ పెరుగుతుంది అనుకున్న సమయంలో మళ్ళీ పరాజయాలు ఎదురయ్యాయి. ఇప్పుడు నితిన్ కు అర్జెంట్ గా హిట్ అవసరం. ఈ నేపథ్యంలో నితిన్ తీసుకుంటున్న నిర్ణయం ఆసక్తిరేపుతోంది.

    ఇష్క్ తరువాత

    ఇష్క్ తరువాత

    ఇష్క్ చిత్రంతో క్లాస్ హిట్ అందుకున్న నితిన్ ఊపిరి పీల్చుకున్నాడు. ఆ తరువాత తన బాడీ లాగ్వేజ్ కు తగ్గట్లుగా గుండె జారీ గల్లంతయ్యిందే, హార్ట్ ఎటాక్ లాంటి ప్రేమ కథలు ఎంచుకుని విజయాలు దక్కించుకున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శత్వంలో చేసిన అ..ఆ చిత్రం 45 కోట్లకు పైగా వసూలు చేసి నితిన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అ..ఆ చిత్రం తరువాత చేసిన యాక్షన్ మూవీ లై నిరాశపరిచింది. చల్ మోహన్ రంగ, శ్రీనివాస కళ్యాణం చిత్రాలు కూడా నిరాశపరిచాయి.

    హిట్ అవసరం

    హిట్ అవసరం

    నితిన్ కెరీర్ మళ్ళీ గాడిలో పడాలంటే అర్జెంట్ గా ఓ హిట్ అవసరం. నితిన్ ప్రస్తుతం ఛలో ఫేమ్ వెంకీ కుడుముల దర్శత్వంలో నటించేందుకు సిద్ధం అవుతున్నాడు. డిసెంబర్ నుంచి ఈ చిత్రం ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. క్రేజీ భామ రష్మిక మందనహీరోయిన్ గా నటించబోతున్నట్లు తెలుస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అంటూ వార్తలు వస్తున్నాయి. సెటప్ అంతా బాగానే ఉంది. కానీ నితిన్ మరో చిత్రం విషయంలో తీసుకున్న నిర్ణయం కాస్త ఆలోచింపజేసే విధంగా ఉంది.

    రాక్షసన్ రీమేక్

    రాక్షసన్ రీమేక్

    తమిళంలో ఘనవిజయం సాధించిన విష్ణు విశాల్ చిత్రం రాక్షసన్ రీమేక్ హక్కులని నితిన్ సొంతం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయంలో ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. సినీవర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం నితిన్ ఈ చిత్రాన్ని రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఓ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాన్ని రీమేక్ చేయడం సాహసమే అవుతుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

    మరో వాదన

    మరో వాదన

    ఈ చిత్రానికి సంబంధించి కొందరు మరో వాదన వినిపిస్తున్నారు. రాక్షసన్ రీమేక్ కు నితిన్ కేవలం నిర్మాతగా మాత్రమే వ్యవహరిస్తారని అంటున్నారు. తమిళంలో విష్ణు విశాల్ హీరోగా నటించాడు. విడుదలై నెలరోజులు గడుస్తున్నా ఈ చిత్ర సంచలనాలు నమోదు చేస్తూనే ఉంది.

    English summary
    Nithin interesting decision on his new movie. Here is the details
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X