నితిన్ పెళ్లికి వేదిక ఖరారు.. అతి కొద్ది మందితో అక్కడికి.. ఇండస్ట్రీ నుంచి వారికి మాత్రమే పిలుపు
టాలీవుడ్‌లో మోస్ట్ బ్యాచ్‌లర్ లిస్ట్ చూస్తే చాంతాడంత కనిపిస్తుంది. ప్రభాస్ దగ్గరి నుంచి మొదలైతే ఈ లిస్ట్‌లో ఎక్కేవారి లెక్కేలేదు. రానా, వరుణ్ తేజ్, నితిన్ ఇలా పెద్ద లిస్టే కనిపిస్తుంది. అయితే వీటిలో హీరో నితిన్ పేరును తీసే సమయం వచ్చింది. గత కొన్ని రోజులుగా నితిన్ పెళ్లి అంటూ వార్తలు హొరెత్తుతోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ నితిన్ పెళ్లికి సంబంధించిన తాజాగా ఓ అప్‌డేట్ వచ్చేసింది.

ప్రేమ పెళ్లి..
యూఎస్‌కి చెందిన ఎంబీఏ గ్రాడ్యుయేట్ శాలినిని పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తుంది. గత నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకోబోతోంది. రీసెంట్‌గా నితిన్ పెళ్లి ఏర్పాట్లు కూడా మొదలైపోయాయని సమాచారం.

పెళ్లి పనులన్నీ ఆమె చేతుల మీదుగానే..
ప్రేమ పెళ్లే అయినా.. ఇరు కుటుంబాలు అంగీకరించడంతో అంగరంగ వైభవంగా ఈ పెళ్లిని ఏప్రిల్‌లో జరుపబోతోన్నట్లు తెలుస్తోంది. నితిన్ పెళ్లికి సంబంధించిన పనులన్నింటిని నితిన్ అక్క.. నిర్మాత నిఖితా రెడ్డి దగ్గరుండి చూసుకుంటోందని టాక్.

డెస్టినేషన్ వెడ్డింగ్..
ఈ మధ్య సినీ స్టార్స్ అంత తమ వివాహాలు డెస్టినేషన్ వెడ్డింగ్‌గా చేసుకుంటున్నారు. నితిన్ కూడా అదే బాటలో చేరాడు.. అయితే దుబాయ్ లాంటి అత్యంత ఖరీదైన నగరంలో ప్లాన్ చేశాడని తెలుస్తోంది. ఈ పెళ్లికి అతి కొద్ది మందికి మాత్రమే పిలుపు వెళ్తుందోని.. సినీ ఇండస్ట్రీ నుంచి అయితే త్రివిక్రమ్, నీరజ కోన లాంటి వారికేనని సమాచారం.
Recommended Video

గ్రాండ్ పార్టీ..
డెస్టినేషన్ వెడ్డింగ్ అనంతరం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా రిసెప్షన్ ఉంటుందని తెలుస్తోంది. ఈ రిసెప్షన్ కు టాలీవుడ్ సెలబ్రిటీలందరినీ ఆహ్వానించనున్నట్లు సమాచారం. ఈ వేడుకకు దాదాపు సినీ పరిశ్రమ మొత్తం తరలిరానున్నట్లు టాక్. నితిన్ ప్రస్తుతం భీష్మ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు.


Click it and Unblock the Notifications











