twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌లో నితిన్, సుకుమార్.. ఆసక్తి రేపుతున్న క్రేజీ కాంబినేషన్!

    |

    మూడేళ్ళ క్రితం విడుదలైన కుమారి 21 ఎఫ్ చిత్రం గుర్తుందిగా. యువతలో చిన్నపాటి అలజడినే సృష్టించింది ఈ చిత్రం. సుకుమార్ దర్శకుడిగానే కాక అప్పుడప్పుడూ ఇలాంటి ప్రయోగాలు కూడా చేస్తున్నాడు. కుమారి 21 ఎఫ్ చిత్రానికి సుకుమార్ కథ, స్క్రీన్ ప్లే అందించి తన అసిస్టెంట్ కు దర్సత్వ భాద్యతలు అప్పగించాడు. ఆ ప్రయోగం అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చింది. ఇప్పుడు మళ్ళి అలాంటి ప్రయత్నమే చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

    నితిన్ హీరోగా

    నితిన్ హీరోగా

    యంగ్ హీరో నితిన్ కోసం సుకుమార్ ఓ ఆసక్తికరమైన కథని రూపొందించాడు. కుమారి 21 ఎఫ్ చిత్రంతో దర్శకుడిగా నిరూపించుకున్న సూర్య ప్రతాప్ ఈ చిత్రానికి దర్శత్వం వహించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్ర నిర్మాణం విషయంలో పెద్ద పెద్ద పేర్లే వినిపిస్తున్నాయి.

     గీత ఆర్ట్స్ 2 బ్యానర్

    గీత ఆర్ట్స్ 2 బ్యానర్

    మెగా నిర్మాత అల్లు అరవింద్ నడిపిస్తున్న గీత ఆర్ట్స్ 2 బ్యానర్ లో ఈ చిత్రం రూపొందబోతోందట. మెగా కాంపౌండ్ లోని నిర్మాత బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. బన్నీవాసు గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో నిర్మించిన గీత గోవిందం చిత్రం ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే.

    నితిన్ వరుస చిత్రాలు

    నితిన్ వరుస చిత్రాలు

    నితిన్ వరుస చిత్రాలతో బిజీ అవుతున్నాడు. ఛలో ఫేమ్ వెంకీ కుడుముల దర్శత్వంలో నితిన్ నటించేందుకు సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. చంద్రశేఖర్ ఏలేటి దర్శత్వంలో కూడా నితిన్ నటించబోతున్నాడట. ఇప్పుడు సుకుమార్ కథ అందించే చిత్రంలో నటించనుండడం నితిన్ కు మంచి అవకాశం అని చెప్పొచ్చు.

    త్వరలో ప్రారంభం

    త్వరలో ప్రారంభం

    ఈ చిత్రానికి సంబందించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అనేక ప్రత్యేకతలు ఉన్న ఈ కాంబినేషన్ ఇప్పటినుంచే ఆడియన్స్ లో ఆసక్తిని పెంచుతోంది. గోపి సుందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తాడని అంటున్నారు. ఈ చిత్రాన్ని త్వరలో ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నారు.

    English summary
    Nithin movie with Sukumar. Geetha Arts 2 will producing this movie
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X