ఓపినింగ్ అయిన నితిన్ కొత్త సినిమా ఆగిపోయింది
హైదరాబాద్: ఇష్క్ హిట్ తో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన నితిన్ వరసగా సినిమాలు చేసే ప్రాసెస్ లో రీసెంట్ గా ఓ చిత్రం ఓపెన్ అయ్యింది. తన సొంత సంస్ధ లో ఈ చిత్రం నిర్మాణం ప్రారంభించారు. ఈ చిత్రానికి సురేంద్రరెడ్డి శిష్యుడైన శ్రీనివాస్ దర్శకుడు గా మొదలెట్టారు. కానీ క్రియేటివ్ డిఫెరెన్సిస్ వల్ల చిత్రం ఆగిపోయిందని తెలుస్తోంది. డైరక్టర్ చెప్పిన స్క్రిప్టు నచ్చక ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్పుకుంటున్నారు. ఈ స్టాట్ లో కరుణాకరన్ చిత్రం మొదలయ్యే అవకాసం ఉంది. కరుణాకరన్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమాకి నిఖితా రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తారు.
నిర్మాత మాట్లాడుతూ... ''కరుణాకరన్ సినిమా అంటే ముందుగా గుర్తొచ్చేది 'తొలిప్రేమ'. ఈ సినిమా కూడా అదే తరహాలో ఉంటుంది. నితిన్ పాత్ర చిత్రణ వైవిధ్యంగా ఉంటుంది. ఇంకా హీరోయిన్ ను ఎంపిక చేయలేదు. త్వరలో పూజాకార్యక్రమాలతో లాంఛనంగా సినిమాని ప్రారంభిస్తాము'' అని అన్నారు. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ గా హన్సికని అడుగుతున్నట్లు సమాచారం.
మరో ప్రక్క నితిన్ హీరోగా ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్ ఫోటాన్ కథాస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పెై తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్న 'కొరియర్ బోయ్ కళ్యాణ్' చిత్రం షూటింగ్ పూర్తి అయ్యి రిలీజ్ కి రెడీగా ఉంది. ప్రభుదేవా వద్ద అసోసియేట్‌గా పనిచేసిన ప్రేమ్‌సాయి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తమిళంలో ఈ చిత్రం 'తమిళ సెల్వనుం తనియార అంజలుం' పేరుతో ఈ చిత్రం రూపొందబోతోంది. నిర్మాత గౌతమ్ వాసుదేవ మీనన్ మాట్లాడుతూ 'ఈ చిత్రంలో లవ్, యాక్షన్, కామెడీ అన్నీ సమపాళ్లలో ఉంటాయి. సింగర్ కార్తీక్ ఈ చిత్రానికి మంచి సంగీతం అందిస్తున్నాడు.


Click it and Unblock the Notifications












