పవన్ దర్శకుడుకి నితిన్ గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్: పవన్ కళ్యాణ్ తో రీసెంట్ గా కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రం రూపొందించిన పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చిత్రం చేయటానికి నితిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమచారం. ఈ చిత్రంలో నితిన్ తో పాటు మరోహారో ఉంటాడని తెలుస్తోంది. నిర్మాత డి.ఎస్ రావు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
గుండె జారి గల్లంతయ్యిందే చిత్రం ఘన విజయంతో నితిన్ కు వరస ఆఫర్స్ వచ్చి పడుతున్నాయి. ప్రస్తుతం నితిన్ 'కొరియర్ బాయ్ కళ్యాణ్' చిత్రం షూటింగులో బిజీగా గడుపుతున్నాడు. గౌతం మీనన్ నిర్మిస్తున్న ఈచిత్రానికి ప్రేమ్ సాయి దర్శకత్వం వహిస్తున్నారు. యామి గౌతం నితిన్ సరసన హీరోయిన్ గా ఎంపికయింది. కార్తీక్ ఈచిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
ఈ సినిమాల తర్వాత మరో రెండు ప్రాజెక్టులు నితిన్‌కు ఖరారయ్యాయి. అందులో కిక్ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్వకత్వంలో రూపొందబోయే సినిమా ఒకటి కాగా, మరొకటి అలా మొదలైంది, జబర్దస్త్ చిత్రాల ఫేం నందినీరెడ్డి దర్శకత్వంలో చేయనున్నారు. ఈ చిత్రాలు 2014లో సెట్స్ పైకి వెళ్లనున్నాయి.


Click it and Unblock the Notifications












