నిత్యామీనన్ కొత్త చిత్రం రేపే లాంచ్

By Srikanya

హైదరాబాద్: నిత్యామీనన్ ప్రధాన పాత్రలో హీరోయిన్ ఓరియెంటెడ్ గా ఓ చిత్రం రూపొందుతోంది. రాజేంద్రప్రసాద్ హీరోగా వచ్చిన ఓనమాలు తీసిన దర్శకుడు క్రాంతి మాధవ్ డైరక్షన్ లో ఈ చిత్రం ప్రారంభం కానుంది. ఈ చిత్రాన్ని క్రియోటివ్ కమర్షియల్ బ్యానర్ పై కె.ఎస్.రామారావు నిర్మిస్తున్నారు. రేపు(పిభ్రవరి 26న)న హైదరాబాద్ లో ఈ చిత్రం లాంచ్ అవుతుంది. రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. ఓనమాలు చిత్రం కమర్షియల్ గావర్కవుట్ కాకపోయినా క్రిటికల్ గా మంచి పేరు తెచ్చుకుంది.

మరో ప్రక్క నిత్యామీనన్ ప్రధాన పాత్రలో నటించిన 'మాలిని 22' సైతం విడుదలకు సిద్దమవుతోంది. శ్రీప్రియ దర్శకత్వం వహించారు. రాజ్‌కుమార్ థియేటర్స్ ప్రొడక్షన్స్ ప్రై. లిమిటెడ్ పతాకంపై రాజ్‌కుమార్ సేతుపతి ఈ సినిమాను నిర్మించారు. అరవింద్, శంకర్ సంగీతాన్ని సమకూర్చారు. రివేంజ్ డ్రామా గా రూపొందుతున్న ఈ చిత్రం తమిళంలో '22 మాలిని పాళయం కోట్టై' పేరుతో విడుదల చేసారు.

Nithya Menen in a heroine centric film

నిత్యామీనన్ మాట్లాడుతూ "శ్రీప్రియగారు కథ చెప్పినప్పుడు చేయడం కష్టమనిపించినా ఒప్పుకున్నాను. పాటలు బాగా కుదిరాయి. ఈ సినిమాలో నటించిన మేల్ ఆర్టిస్టులకు స్పెషల్ థాంక్స్'' అని చెప్పారు. 22 కొట్టాయం కథను తెలుగు, తమిళ భాషలకు అనుగుణంగా కొన్ని మార్పులు చేసి నిర్మించిన ఈ సినిమాలో ఓ గొప్ప సందేశం ఉంటుందని దర్శకురాలు శ్రీప్రియ సినిమాపై ఉన్న అభిరుచితో ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారని కథానాయిక నిత్యామీనన్ తెలిపారు. సున్నితమైన అంశంతో తెరకెక్కిన సినిమా అని క్రిష్ తెలిపారు.

శ్రీప్రియ మాట్లాడుతూ "ప్రస్తుతం మన సమాజ పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. నిత్య తన పాత్రలో లీనమై నటించింది. ఓ మంచి బలమైన సందేశం ఇచ్చే కథాంశంతో ఈ చిత్రం నిర్మించామని, మలయాళంలో హిట్ అయిన 'కొట్టాయం 22' చిత్రానికి రీమేక్‌గా నిర్మించిన ఈ చిత్రం స్ర్తిలకు, పురుషులకు సమానమైన సందేశాన్ని అందిస్తుందని, ఎక్కువగా స్ర్తిలకే ఓ మోరల్ సపోర్ట్‌గా ఈ చిత్రం నిలుస్తుంది. నిత్యామీనన్ ఆలపించిన 2 పాటలు బావుంటాయి, రోజూ సమాజంలో మన చుట్టూ జరుగుతున్న అనేక సమస్యలపై స్పందనగా ఈ చిత్రం నిలుస్తుంది. అరవింద్- శంకర్, అనంతశ్రీరామ్ కలిసి పాటలకు ప్రాణం పోశారు. '' అని తెలిపారు.

కోవైసరళ, కోట శ్రీనివాసరావు, విద్యురామన్, సూదుకవ్వమ్, అంజలిరావ్, హార్లిక్స్ అంకుల్, మురళి, చంద్ర తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఆర్ట్: ప్రేమ్‌శ్రీనివాస్, మాటలు: అనురాధ ఉమర్జీ, గౌతంకశ్యప్, పాటలు: అనంత్‌శ్రీరామ్, సంగీతం: అరవింద్-శంకర్, ఎడిటింగ్: భవన్ శ్రీకుమార్, కెమెరా: మనోజ్‌పిళ్లై, నిర్మాత: రాజ్‌కుమార్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీప్రియ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X