పవన్ కళ్యాణ్‌తో నిత్యా మీనన్?
హైదరాబాద్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్వరలో త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయబోయే సినిమాపై రకరకాల రూమర్లు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ చిత్రంలో హీరోయిన్ ఇంకా ఖరారు కాలేదు. జల్సా చిత్రంలో పవన్ తో చేసిన ఇలియానానే ఈ చిత్రంలో తీసుకోబోతున్నారనే వార్తలు వినిపించాయి. ఇలియానాకు క్రేజ్ తగ్గడంతో ఇతర హీరోయిన్ల కోసం చూస్తున్నారని అంటున్నారు. తాజాగా ఈ లిస్టులో నిత్యామీనన్ పేరు వినిపిస్తోంది.
అలా మొదలైంది, ఇష్క్ చిత్రాల్లా బబ్లీగా నటించిన ప్రేక్షకులను ఆకట్టుకున్న నిత్యా మీనన్ పవన్‌కు సూటవుతుందని దర్శకుడు భావిస్తున్నాడట. అయితే ఈ వార్తల్లో నిజం ఎంతో తేలాల్సి ఉంది. త్వరలోనే ఈ విషయమై అధికారిక సమాచారం వెలువడనుంది. ఈ చిత్రం నవంబర్ నుంచి ప్రారంభం కానుంది. ప్రొడ్యూసర్ బీవీయస్‌యన్ ప్రసాద్ రిలియన్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థతో కలిసి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించడానికి సిద్ధం అవుతున్నారు.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ 'కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రానికి డబ్బింగ్ కార్యక్రమాలు ముగించుకుని యూరఫ్ హాలిడే ట్రిప్‌కు సిద్దం అవుతున్నారు. ఈలోగా దర్శకుడు త్రివిక్రమ్ ప్రీప్రొడక్షన్ పనులు పూర్తి చేసి షూటింగుకు అన్నీ సిద్ధం చేయనున్నాడు. దాదాపు 40 రోజుల పాటు పవన్ కళ్యాణ్ వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తారని తెలుస్తోంది.
ఇక కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రం విషయానికొస్తే.... పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈచిత్రం అక్టోబర్ 18న గ్రాండ్ గా విడుదలవ్వబోతోంది. ఈచిత్రంలో పవన్ కళ్యాణ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుగా నటిస్తున్నారు. అన్యాయాలను ఎదురించే ధైర్యంగల రిపోర్టర్‌గా పవన్ కనిపించనున్నాడు. పవన్ కళ్యాణ్ కి జంటగా హీరోయిన్ తమన్నా ఇందులో కెమెరామెన్ పాత్ర చేస్తోంది.


Click it and Unblock the Notifications











