RRRలో గిరిజన యువతిగా.. జూ. ఎన్టీఆర్ ప్రేమలో క్రేజీ హీరోయిన్!

మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలసి రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ చిత్ర తదుపరి షూటింగ్ పూణే, ఢిల్లీ, కోల్ కతా లాంటి నగరాల్లో జరగనుంది. ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఎన్టీఆర్ కు జోడిగా బ్రిటిష్ భామ డైసీ ఎడ్గార్ జోన్స్ ని రాజమౌళి ఎంపిక చేశాడు. వ్యక్తిగత కారణాల వల్ల ఈ క్రేజీ ప్రాజెక్ట్ నుంచి డైసీ తప్పుకుంది. దీనితో రాజమౌళి ప్రస్తుతం ఎన్టీఆర్ కు సరైన జోడీని వెతికే పనిలో తలమునకలై ఉన్నాడు. మరో పది రోజుల్లో ఆర్ఆర్ఆర్ చిత్ర షూటింగ్ తిరిగి ప్రారంభం కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఈ చిత్రంలో నిత్యామీనన్ పాత్ర గురించి ఆసక్తికర వార్తలు వస్తున్నాయి.

గిరిజన యువతిగా

గిరిజన యువతిగా

ఆర్ఆర్ఆర్ చిత్రంలో నిత్యామీనన్ ఓ ప్రత్యేకమైన పాత్రలో నటించబోతున్నట్లు ఇదివరకే వార్తలు వచ్చాయి. తాజాగా నిత్యామీనన్ పాత్ర గురించి మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. నిత్యామీనన్ ఈ చిత్రంలో గిరిజన యువతి పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. నిత్యామీనన్ పాత్ర ఆడియన్స్ కు ఎమోషనల్ గా కనెక్ట్ అవుతుందని అంటున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్, నిత్యామీనన్ మధ్య సన్నివేశాలు చాలా కీలకం కానున్నాయట.

 ఎన్టీఆర్ ప్రేమలో

ఎన్టీఆర్ ప్రేమలో

రాజమౌళి ఎన్టీఆర్ సరసన నటించే హీరోయిన్ ని ఎంపిక చేయాల్సి ఉంది. కానీ నిత్యామీనన్ కూడా ఎన్టీఆర్ ప్రేయసిగానే నటిస్తుందట. నిత్యామీనన్ పాత్ర ఎన్టీఆర్ కు సెకండ్ హీరోయిన్ లాగా ఉంటుందని వార్తలు వస్తున్నాయి. దీనిపై ఆర్ఆర్ఆర్ టీం అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. ఆర్ఆర్ఆర్ చిత్ర తదుపరి షెడ్యూల్స్ ని నార్త్ ఇండియాలో ప్లాన్ చేస్తున్నారు.

గాయాల బెడద

గాయాల బెడద

కొన్ని రోజుల క్రితం రాంచరణ్ బయపడడంతో ఆర్ఆర్ఆర్ చిత్ర షూటింగ్ ని వాయిదా వేశారు. జూ. ఎన్టీఆర్ కూడా గాయపడ్డట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఎన్టీఆర్ గాయంతో ఉన్నట్లు కనిపిస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కానీ ఎన్టీఆర్ గాయపడ్డట్లు వస్తున్న వార్తలపై చిత్రయూనిట్ అధికారికంగా స్పందించలేదు. త్వరలో ప్రారంభం కాబోయే షెడ్యూల్ లో ఎన్టీఆర్, రాంచరణ్ తో పాటు అలియా భట్, అజయ్ దేవగన్ కూడా పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది.

దానయ్య నిర్మాణంలో

దానయ్య నిర్మాణంలో

ప్రముఖ నిర్మాత డివివి దానయ్య ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దాదాపు 400 కోట్ల బడ్జెట్ లో ఈ చిత్రాన్ని తెరక్కిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. 2020 జులై 30న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు కూడా ప్రకటించేశారు. రాంచరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో, ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X