కుర్ర హీరోతో నిత్యా మీనన్ రొమాన్స్.. అలా కాంప్రమైజ్ అయ్యారట!
దక్షిణాదిలో మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే అది నిత్యామీనన్ అని చెప్పుకోవచ్చు. అయితే గత కొద్దికాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల కాలంలో ఆమె తన నటనతో మెప్పించిన దాఖలాలు చాలా తక్కువే. ఈ మధ్య ఎన్టీఆర్ బయోపిక్‌లో కనిపించినా అది నామమాత్రంగానే మిగిలి.. ఆమెకు మరింత గుర్తింపు తీసుకొచ్చిన పరిస్థితి కనిపించలేదు. గతంలో మహానటిలో టైటిల్ పాత్రను పోషించడానికి అవకాశాలు వచ్చినా.. సరిగా దానిని అందిపుచ్చుకోకపోవడంతో ఆ రోల్‌ను కీర్తి సురేష్ ఎగురేసుకుపోయినట్టు వార్తలు వచ్చాయి.
ఇలాంటి పరిస్థితుల్లో టాలీవుడ్‌కు దూరమైన నిత్యామీనన్ మళ్లీ తెలుగు తెరపై మెరిసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే తన కంటే తక్కువ వయసు ఉన్న హీరోతో జతకట్టడం.. అదీ ఫ్లాపులతో సతమవుతున్న కుర్ర హీరోతో కావడం సినీ వర్గాల్లో మరింత చర్చనీయాంశమైంది. నిత్యామీనన్ ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకొన్నారనే వార్తపై చర్చ జరుగుతున్నది.

గుండె జారి గల్లంతయిందే సినిమా నిత్యా మీనన్‌కు మంచి గుర్తింపు తెచ్చింది. ఆ చిత్రానికి విజయ్ కుమార్ కొండా దర్శకత్వం వహించారు. ప్రస్తుతం నిత్యామీనన్‌కు విజయ్ కుమార్ ఓ కథను నెరేట్ చేశారట. అది నచ్చడంతో నిత్య మీనన్ ఆ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట.
ఇక తన పక్కన సరైన హిట్లు లేకుండా కెరీర్‌లో తడబాటుకు గురవుతున్న రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్నారట. రాజ్ తరుణ్‌తో నటించడానికి కూడా నిత్య మీనన్ సరే అన్నట్టు వార్తలు వస్తున్నాయి. కథ డిమాండ్ మేరకే రాజ్ తరుణ్‌తో నిత్యా మీనన్ జతకట్టేందుకు ఒప్పుకొన్నారట.
నిత్యామీనన్ కెరీర్ విషయానికి వస్తే, మలయాళ, తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందుతున్న ప్రాణ చిత్రంలో నటిస్తున్నది. కొలంబి, ఆనంద మార్గం అనే మలయాళ చిత్రాలను ఒప్పుకొన్నది. తమిళంలో జయలలిత బయోపిక్ ది ఐరెన్ లేడి, సైకో చిత్రాల్లో నటిస్తున్నది. హిందీలో అక్షయ్ కుమార్ చిత్రం మిషన్ మంగళ్ అనే చిత్రంలో, తెలుగులో రాజమౌళి RRR సినిమాలో కీలక పాత్రను పోషిస్తున్నారు.


Click it and Unblock the Notifications











