twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    RRR: ఎన్టీఆర్‌‌కు హీరోయిన్‌గా రెండోసారి.. రాజమౌళి స్క్రీన్ టెస్ట్ చేశాడా!

    |

    మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలసి రాజమౌళి దర్శకత్వంలోఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల చిత్ర యూనిట్ గుజరాత్‌లోని వడోదరకు వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ రాంచరణ్ కు గాయం కావడంతో షూటింగ్ రద్దయింది. ఆర్ఆర్ఆర్ చిత్ర తదుపరి షూటింగ్ పూణే, ఢిల్లీ, కోల్ కతా లాంటి నగరాల్లో జరగనుంది. ఆర్ఆర్ఆర్ చిత్రంలో భాగంగా చిత్ర యూనిట్ కు మరో ఊహించని పరిణామం ఎదురైంది. ఎన్టీఆర్ కు జోడిగా బ్రిటిష్ భామ డైసీ ఎడ్గార్ జోన్స్ ని రాజమౌళి ఎంపిక చేశాడు. షూటింగ్ లో పాల్గొనాల్సిన సమయంలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ నుంచి డైసీ తప్పుకుంది. రాజమౌళి ప్రస్తుతం ఎన్టీఆర్ కు హీరోయిన్ ని వెతికే పనిలో తలమునకలై ఉన్నాడు.

    కుటుంబ సమస్యలు

    కుటుంబ సమస్యలు

    రాజమౌళి ఆర్ఆర్ఆర్ చిత్రం కోసం ఎన్టీఆర్ హీరోయిన్ గా డైసీ ఎడ్గార్ జోన్స్ పేరు చెప్పగానే అంతా ఆమె గురించి ఆసక్తిగా గూగుల్ లో వెతకండం ప్రారంభించారు. తక్కువ సమయంలోనే డైసీ ఎడ్గార్ జోన్స్ పేరు అంతటా వ్యాపించింది. ఎన్టీఆర్ సరసన ఓ బ్రిటిష్ అమ్మాయిని చూడబోతున్నాం అని అభిమానులు సంబరపడుతున్న సమయంలో షాక్ తగిలింది. కుటుంబ సమస్యల కారణంగా డైసీ ఈ చిత్రం నుంచి తప్పుకుంది.

    అనేక ఉహాగానాలు

    అనేక ఉహాగానాలు

    ప్రస్తుతం ఎన్టీఆర్ సరసన నటించే హీరోయిన్ విషయంలో అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. శ్రద్దా కపూర్, పరిణీతి చోప్రా లాంటి హీరోయిన్ల పేర్లు జోరుగా ప్రచారం జరుగుతున్నాయి. కానీ చిత్ర యూనిట్ ఇంకా అధికారికంగా ఎవరినీ ప్రకటించలేదు. ఈ చిత్రం బ్రిటిష్ కాలం నేపథ్యంలో సాగుతుంది. అందువల్ల మరో బ్రిటిష్ భామని ఎంచుకుంటారా అనే చర్చ జరుగుతున్న సమయంలో ఇండియన్ హీరోయిన్లు కూడా రేసులోకి వస్తున్నారు.

     క్రేజీ హీరోయిన్

    క్రేజీ హీరోయిన్

    తాజాగా ఎన్టీఆర్ సరసన నటించే హీరోయిన్ విషయంలో క్రేజీ హీరోయిన్ పేరు తెరపైకి వచ్చింది. ఆర్ఆర్ఆర్ చిత్రంలో నిత్యామీనన్ నటించే అవకాశం ఉందంటూ వార్తలు వస్తున్నాయి. ఇటీవల నిత్యామీనన్ ఆర్ఆర్ఆర్ టీం పిలుపు మేరకు బెంగుళూరు నుంచి హైదరాబాద్ వచ్చిందని అంటున్నారు. రాజమౌళి నిత్యామీనన్ కు స్క్రీన్ టెస్ట్ చేసినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. అంతా ఓకే అయితే నిత్య మీనన్ ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

    ఎన్టీఆర్‌తో రెండోసారి

    ఎన్టీఆర్‌తో రెండోసారి

    ఈ చిత్రంలో నిత్య మీనన్ ఖరారైతే ఎన్టీఆర్ సరసన రెండవసారి నటించబోతున్నట్లు అవుతుంది. గతంలో వీరిద్దరూ జనతా గ్యారేజ్ చిత్రంలో జంటగా నటించారు. సినీవర్గాలలో జరిగుతున్న మరో ప్రచారం ప్రకారం నిత్య మీనన్ ఎన్టీఆర్ కు హీరోయిన్ గా నటించడం లేదని, ఆర్ఆర్ఆర్ లో ఆమె కీలక పాత్రలో నటించబోతోందని కూడా చెబుతున్నారు. ఇందులో ఏది వాస్తవమో తేలాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.

    English summary
    Nithya Menen to romance with Jr NTR in Rajamouli's RRR movie. DVV Danayya producing this film over 400 cr budget
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X