twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ తెలుగు సినిమాలో నిత్యా మీనన్ గెస్ట్ రోల్

    By Srikanya
    |

    అలా మొదలైంది చిత్రంతో పరిచయమైన నిత్యామీనన్ ఇష్క్ సినిమాతో యువ హృదయాలలో సెటిలైంది. ఆమె పోస్టర్ మీద కనపడితే చాలా ధియోటర్స్ జనంతో నిండుతున్నాయి..శాటిలైట్ మార్కెట్ వస్తోంది. దాంతో ఆమె గెస్ట్ గా కనిపించినా ఆ క్రేజే వేరు అంటున్నారు. అందుకేనేమో సిద్దార్ద,సమంత కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రంలో ఆమెను గెస్ట్ గా తీసుకున్నారు.

    నిత్యామీనన్ గెస్ట్ గా తొలిసారి చేస్తున్న ఈ చిత్రలో ఆమె పాత్ర ఉండేది కొద్ది సేపైనా మంచి సీన్స్ ఉన్నాయంటున్నారు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని శ్రీ సాయిగణేశ్ ప్రొడక్షన్స్ పతాకంపై బెల్లంకొండ సురేశ్ నిర్మిస్తున్నారు. షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చిందని తెలుస్తోంది.

    ఈ చిత్రం గురించి బెల్లంకొండ సురేశ్ తెలియజేస్తూ "నందినీరెడ్డి అద్భుతమైన కథ చెప్పారు. సిద్ధార్థ్, సమంత కూడా కథ వినగానే ఎంతో ఇన్‌స్పైర్ అయ్యారు. ఇటీవల 'కాంచన', 'కందిరీగ' వంటి చిత్రాలు మా బేనర్‌కి ఎంతో పేరు తెచ్చాయి. ఈ సినిమా ఆ కోవలోనే పెద్ద హిట్టవుతుంది'' అని చెప్పారు.

    నందినీరెడ్డి మాట్లాడుతూ - నాని, నిత్యాల జంటలాగే, సమంత, సిద్దార్ధ్ జంట అనగానే 70% విజయం వచ్చినట్లేననీ, అందరికీ నచ్చే విధంగా ఈ చిత్రం ఉంటుందని తెలిపారు. ఈ చిత్రానికి మాటలు: వెలిగొండ శ్రీనివాస్, ఆర్ట్: ఎ.ఎస్.ప్రకాష్, స్క్రీన్‌ప్లే: కోన వెంకట్, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, సంగీతం: తమన్ ఎస్.ఎస్, నిర్మాతలు: బెల్లంకొండ సురేష్, బెల్లంకొండ గణేష్‌బాబు, కథ, దర్శకత్వం: బి.వి.నందినీరెడ్డి.

    English summary
    Nithya Menon made her comeback with Ishq and has now agreed to do a special appearance in a Siddharth-Samantha romantic comedy. It’s probably the first time that Nithya is doing a special cameo. Producer Bellamkonda Suresh was keen on having the Malayali beauty and had to persuade her till she finally agreed.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X