'గౌరవం' ఫ్లాఫ్ ఎఫెక్ట్ : నిత్యామీనన్ కి ఛాన్స్

By Srikanya

హైదరాబాద్: ఒక కాంబినేషన్ ఒకసారి హిట్టైందంటే దాన్ని కంటిన్యూ చేయటం సినిమా వారి ఆనవాయితీ,సెంటిమెంట్. ఇప్పుడు అదే కోవలో నితిన్,నిత్యామీనన్ జంట కంటిన్యూ అవుతోంది. ఇష్క్, గుండె జారి గల్లంతైంది చిత్రాలు విజయం సాధించటంతో ఈ జంటకు మార్కెట్లో మంచి క్రేజ్ వచ్చింది. దాంతో ఆ క్రేజ్ ని మరోసారి క్యాష్ చేసుకోవాలని నితిన్ నెక్ట్స్ చిత్రం నిర్మాతలు ఫిక్స్ అయ్యారని సమాచారం.

నితిన్ హీరోగా ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్ ఫోటాన్ కథాస్ ప్రొడక్షన్స్ బేనర్‌పై తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్న 'కొరియర్ బోయ్ కళ్యాణ్' చిత్రంలో ఈ మార్పు జరగనుంది. మొదట ఈ చిత్రంలో గౌరవం చిత్రం హీరోయిన్ యామీ గౌతమి అనుకున్నారు. కానీ గౌరవం ప్లాప్ కావటంతో ఈ సినిమాలోంచి ఆమెను తొలిగించినట్లు తెలుస్తోంది.

ప్రభుదేవా వద్ద అసోసియేట్‌గా పని చేసిన ప్రేమ్ సాయి ఈచిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగులో 'కొరియర్ బోయ్ కళ్యాణ్'గా, తమిళ్‌లో 'తమిళ సెల్వనుంతనియార అంజలుం' పేరుతో ఈచిత్రం రూపొందబోతోంది. ఈ చిత్రం గూర్చి నిర్మాత గౌతమ్‌ వాసుదేవ మీనన్ మాట్లాడుతూ నితిన్‌తో నిర్మిస్తున్న 'కొరియర్‌బోయ్ కళ్యాణ్' చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే అంశాలతో వుంటుందని, లవ్, యాక్షన్, కామెడీ సమపాళ్లతో వున్న ఈ చిత్రం భాషల కతీతంగా అందరికీ నచ్చుతుందని, కార్తీక్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారని తెలిపారు.

అలాగే 'నా దర్శకత్వంలో తెలుగులో వచ్చిన 'ఏమాయ చేసావె' చిత్రాన్ని ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. ఇప్పుడు నితిన్‌తో నిర్మిస్తున్న 'కొరియర్ బోయ్ కళ్యాణ్' చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే అంశాలు ఉంటాయి. లవ్, యాక్షన్, కామెడీ అన్ని సమపాళ్లలో ఉన్న కథ ఇది. కథ నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. నా గత చిత్రాల్లో అద్భుతమైన పాటలు పాడిన కార్తీక్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చుతున్నారు. ముఖ్య పాత్రల్లో జైసంతానం, విటివి గణేష్ నటిస్తున్నారు. ఇతర నటీనటుల ఎంపిక జరుగుతోంది' అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X