రవితేజను కూడా అవమానించిన హీరోయిన్!
ఇది వరకే వెంకటేష్, ప్రభాస్ లాంటి హీరోలను అవమానించి వార్తల్లోకెక్కిన మలయాళ కుట్టి నిత్యా మీనన్...తాజాగా మాస్ మహరాజ రవితేజను కూడా ఇన్‌సల్ట్ చేసింది. గతంలో నిత్యా మీనన్ ఓ సారి ప్రభాస్ ఎవరు? అంటూ మీడియా ముందు ప్రశ్నించి యంగ్ రెబల్ స్టార్ అభిమానులను బాధ పెట్టి తలపొగరు గిత్తగా విమర్శలు ఎదుర్కొంది. మరొక సందర్భంలో వెంకటేష్ నాకంటే వయసులో చాలా పెద్దవాడు, నేను సెట్ కాను అంటూ పరోక్షంగా ముసలోడు అనేసింది.
ఇప్పుడు రవితేజ కూడా నిత్యా అహంకారానికి గురయ్యాడు. సినీ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం....పరశురామ్ దర్శకత్వంలో రవితేజ చేయబొయే సినిమాలో ఆమెను హీరోయిన్‌గా తీసుకోవాలని భావించారు. అయితే ఇక్కడ కూడా నిత్య తన తలపొగరు ప్రదర్శించిందని, రవితేజ నాకంటే చాలా ఓల్డ్ అంటూ ఆఫర్‌ను తిరస్కరించిందట.
ఈ నేపథ్యంలో నిత్య మీనన్‌కు ఇకపై తెలుగులో అవకాశాలు రావడం కష్టమే అనే అభిప్రాయం సినీ వర్గాల్లో వినిపిస్తోంది. అలాంటి పెద్ద హీరోలతో సినిమాలను కాదను కోవడం వెనక ఆమె ఉద్దేశ్యం ఏమిటో అర్థం కావడం లేదని మరికొందరు అయోమయం వ్యక్తం చేస్తున్నారు.
నిత్య చివరి సారిగా తెలుగులో నితిన్ సరసన 'ఇష్క్' చిత్రంలో నటించింది. ఆ చిత్రం మంచి విజయం సాధించింది. నిత్య నటనకు మంచి మార్కులే పడ్డాయి. ప్రస్తుతం ఆమె నారా రోహిత్‌తో కలిసి 'ఒక్కడినే' చిత్రంలో నటిస్తోంది. వీటితో పాటు పలు మలయాళం, తమిళ సినిమాలతో బిజీగా ఉంది.


Click it and Unblock the Notifications











