మహానటి సినిమా లో ఆ హీరోయిన్ చెయ్యాలి, కాని కీర్తి చేసింది!
తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఓ సువర్ణాధ్యాయాన్ని సృష్టించుకున్న సావిత్రి జీవితం ఆధారంగా 'మహానటి' పేరుతో తెలుగు, తమిళ భాషల్లో సినిమా నిర్మాణం జరుగుతున్న విషయం తెలిసిందే. కీర్తి సురేష్ ఈ చిత్రంలో సావిత్రిగా నటిస్తుండగా.. సమంత జర్నలిస్ట్ మధురవాణిగా.. విజయ్ దేవకొండ ఫోటోగ్రాఫర్ విజయ్ ఆంటోనీగా నటిస్తున్నారు. మే 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
సావిత్రి పాత్రకోసం ముందుగ దర్శకుడు హీరోయిన్ నిత్య మీనన్ ను సంప్రదించడం జరిగిందని సమాచారం, కాని నిత్య మీనన్ సినిమా కోసం బరువు తగ్గాల్సి వస్తుందని మహానటి చెయ్యడానికి అంగీకరించలేదని తెలుస్తోంది. ఆ స్థానంలో కీర్తి వచ్చింది. కీర్తి సురేష్ సావిత్రి పాత్రలో చక్కగా సెట్ అయ్యిందని అంటున్నారు జనాలు.

నిన్న జరిగిన ఈ సినిమా ఆడియో వేడుకకు ఎన్టీఆర్, నాగార్జున, నాని అతిథులుగా విచ్చేసి సినిమాపై తమ అభిప్రాయాన్ని తెలియజేయడం జరిగింది. అలనాటి నటి సావిత్రి కుటుంభ సభ్యులు ఈ వేడుకకు హాజరు కావడం విశేషం. వైజయంతి మూవీస్ బ్యానర్ లో స్వప్న దత్, ప్రియాంకా దత్ ఈ సినిమాను నిర్మించారు.


Click it and Unblock the Notifications











