నిత్యామీనన్‌ని ప్రభాస్ ఫ్యాన్స్ భయపెట్టారు!?
దయచేసి నన్ను అర్థం చేసుకోవలసిందిగా ప్రతి ఒక్కరినీ, ముఖ్యంగా ప్రభాస్ ఫాన్స్‌ను కోరుతున్నాను అంటూ నిత్యామీనన్ మీడియా ముఖంగా రిక్వెస్ట్ చేసింది. ప్రభాస్ ఎవరు అంటూ అడిగి హాట్ టాపిక్ గా మారిన నిత్యా మీనన్ కి ప్రబాస్ అభిమానులతో నెగిటివ్ స్పందనతో భయం పట్టుకున్నట్లుంది. ఈ విషయమై ఆమె క్లారిటీ ఇస్తూ.. ఇటీవల ఓ జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు ప్రభాస్‌తో నాకు పరిచయం లేదు. నాకు తన గురించి తెలియదు అని చెప్పాను. నా మనసులో ఉన్న విషయాన్నే చెప్పాను తప్ప నాకు ఎవర్నీ 'హర్ట్" చేయాలని ఉండదు.
మీడియాలో వచ్చిన వార్తలు చూసి కొంతమంది ప్రభాస్ ఫాన్స్ మెసేజెస్ పంపారు. ప్రభాస్ చాలా మంచి వ్యక్తి. వెరీ నైస్ పర్సన్. ఆయనతో కలిసి నటించాలని ఉంది.నే ను ఆయనకన్నా హైట్ తక్కువైనందున అవసరమైతే నిచ్చెన వేసుకొని అయినా (నవ్వుతూ) తనతో నటిస్తాను అని చెప్పారు నిత్యామీనన్. ఇటీవల '180" సినిమా ప్రమోషన్ మీట్ లో ఫ్రభాస్ గురించి తనకు తెలియదు అని నిత్యామీనన్ చెప్పిన మీదట ఆమెకు కొన్ని ఫోన్ కాల్స్, మెసేజెస్ వచ్చాయట. దాంతో ఆమె ఇలా స్పందించింది.


Click it and Unblock the Notifications











