తన అభిమాన హీరోతో నితిన్ ఫైట్.. మధ్యలో రానా కూడా సై అంటున్నాడు
టాలీవుడ్ లో చాలా రోజుల తరువాత ఒక సందడి నెలకొంది. బాక్సాఫీస్ వద్ద పాత రికార్డులను బద్దలు కొట్టడానికి అగ్ర హీరోలు మీడియం హీరోలు చాలా పవర్ఫుల్ గా సిద్ధమవుతున్నారు. కోవిడ్ కష్టకాలంలో థియేటర్స్ వరకు జనాలు ఏ స్థాయిలో వస్తారో మరికొన్ని గంటల్లో తేలిపోతుంది. ఇక నితిన్ కూడా ఒక స్పెషల్ డేట్ కు రొమాంటిక్ లవ్ స్టోరీతో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు.

నెక్స్ట్ మరో రొమాంటిక్ మూవీ..
యువ హీరో నితిన్ గత ఏడాది లాక్ డౌన్ కంటే కొన్ని రోజుల ముందు భీష్మ సినిమాను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను అందుకుంది. ఇక నెక్స్ట్ మరో రొమాంటిక్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన రంగ్ దే సినిమాతో కూడా సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమాపై అంచనాలు అయితే భారిగానే ఉన్నాయి.

సోలోగా రావాలని ప్లాన్..
అసలైతే రంగ్ దే సినిమాను ఈ డిసెంబర్ లోనే విడుదల చేయాలని అనుకున్నారు. కుదరకపోతే సంక్రాంతి అని కూడా ప్లాన్ చేసుకున్నారు. కానీ సంక్రాంతికి పోటీ ఎక్కువవ్వడంతో వెనకడుగు వేయక తప్పలేదు. ఇక సమ్మర్ లో ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని నితిన్ సోలోగా రావాలని అనుకున్నాడు.

పవన్ కళ్యాణ్ తో పోటీగా..
అయితే నితిన్ మొదటిసారి తన అభిమాన హీరోతో పోటీ పడక తప్పేలా లేదని అనిపిస్తోంది. నితిన్ పవన్ ను ఎంతగా లైక్ చేస్తాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. పవన్ ప్రొడక్షన్ లో ఒక సినిమా కూడా చేశాడు. అయితే మార్చ్ 26న ముందుగానే రంగ్ దే డేట్ ఫిక్స్ చేసుకోగా ఆ డేట్ కు మరో రెండు సినిమాలు రాబోతున్నట్లు తెలుస్తోంది.

రానా అరణ్య కూడా..
పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ మార్చ్ 26న వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సమ్మర్ హాలిడేస్ మొదలయ్యేది అప్పుడే కాబట్టి ఎలాగైనా అదే తేదీకి రావాలని అనుకుంటున్నారు. మరోవైపు రానా దగ్గుబాటి అరణ్య సినిమా కూడా ఆ డేట్ కు వచ్చే అవకాశం ఉంది. ఆ సినిమాపై కూడా అంచనాలు గట్టిగానే ఉన్నాయి. మరి ఈ బాక్సాఫీస్ ఫైట్ లో ఎవరు ఏ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంటారో చూడాలి.


Click it and Unblock the Notifications











