రీమేక్ చిత్రం కమిటైన నితిన్...డిటేల్స్
ఇక ''సమష్టి కృషితో ఏదైనా సాధ్యం. దీనికి నిదర్శనమే మా చిత్రానికి దక్కుతున్న ఆదరణ'' అన్నారు నితిన్. ఆయన హీరోగా నటించిన చిత్రం 'గుండెజారి గల్లంతయ్యిందే' ఇటీవలే విడుదలైంది. ఈ సందర్భంగా యూనిట్ మీడియాతో సమావేశమైంది. కొండా విజయ్‌కుమార్ దర్శకత్వం వహించారు. నిఖితారెడ్డి నిర్మాత.
నితిన్ మాట్లాడుతూ ''పవన్‌కల్యాణ్ నా అభిమాన హీరో. ఆయన నటించిన 'తొలి ప్రేమ' చిత్రంలోని గీతాన్ని రీమిక్స్ చేశాం. దానికి భలే స్పందన వస్తోంది. ఈ సినిమా విజయానికి కొండా విజయ్‌కుమార్, రచయిత హర్షవర్థన్, స్వరకర్త, అనూప్, ఛాయాగ్రాహకుడు ఆండ్రూ... ఇలా ప్రతి విభాగం కలసికట్టుగా చేసిన ప్రయత్నమిది''అన్నారు.
''మా సంస్థ నుంచి వచ్చిన తొలి చిత్రం 'ఇష్క్' కంటే ఇది పెద్ద విజయమని అందరూ చెబుతున్నారు. ఈ మాట ఎంతో సంతోషాన్ని ఇస్తుంది''అన్నారు నిర్మాత. ''ఈ విజయం వెనక నితిన్ ఉన్నారు. ఆయన అందించిన సహకారం మరువలేనిది''అన్నారు దర్శకుడు. ''దర్శకుడి కథకు మంచి బృందం తోడైతే వచ్చే ఫలితమే ఇది'' అన్నారు రచయిత హర్షవర్ధన్.


Click it and Unblock the Notifications












