twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రీమేక్ చిత్రం కమిటైన నితిన్...డిటేల్స్

    By Srikanya
    |

    హైదరబాద్ : 'గుండెజారి గల్లంతయ్యిందే' చిత్రం హిట్ తో మంచి ఊపు మీద ఉన్న నితిన్ మరో చిత్రం కమిటయ్యారు. పిల్ల జమీందార్, సుకుమారుడు చిత్రాల ఫేమ్ అశోక్ దర్శకత్వంలో ఆ చిత్రం రూపొందనుంది. మళయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన "ఉస్తాద్ హోటల్" చిత్రాన్ని తెలుగులోకి రీమేక్ చేయనున్నారు. ఈ మేరకు నితిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. నిత్యా మీనన్ మరోసారి నితిన్ కి జంటగా చేయనుంది. ప్రస్తుతం నితిన్...కొరియర్ బోయ్ కళ్యాణ్ చిత్రం చేస్తున్నారు.

    ఇక ''సమష్టి కృషితో ఏదైనా సాధ్యం. దీనికి నిదర్శనమే మా చిత్రానికి దక్కుతున్న ఆదరణ'' అన్నారు నితిన్‌. ఆయన హీరోగా నటించిన చిత్రం 'గుండెజారి గల్లంతయ్యిందే' ఇటీవలే విడుదలైంది. ఈ సందర్భంగా యూనిట్ మీడియాతో సమావేశమైంది. కొండా విజయ్‌కుమార్‌ దర్శకత్వం వహించారు. నిఖితారెడ్డి నిర్మాత.

    నితిన్‌ మాట్లాడుతూ ''పవన్‌కల్యాణ్‌ నా అభిమాన హీరో. ఆయన నటించిన 'తొలి ప్రేమ' చిత్రంలోని గీతాన్ని రీమిక్స్‌ చేశాం. దానికి భలే స్పందన వస్తోంది. ఈ సినిమా విజయానికి కొండా విజయ్‌కుమార్‌, రచయిత హర్షవర్థన్‌, స్వరకర్త, అనూప్‌, ఛాయాగ్రాహకుడు ఆండ్రూ... ఇలా ప్రతి విభాగం కలసికట్టుగా చేసిన ప్రయత్నమిది''అన్నారు.

    ''మా సంస్థ నుంచి వచ్చిన తొలి చిత్రం 'ఇష్క్‌' కంటే ఇది పెద్ద విజయమని అందరూ చెబుతున్నారు. ఈ మాట ఎంతో సంతోషాన్ని ఇస్తుంది''అన్నారు నిర్మాత. ''ఈ విజయం వెనక నితిన్‌ ఉన్నారు. ఆయన అందించిన సహకారం మరువలేనిది''అన్నారు దర్శకుడు. ''దర్శకుడి కథకు మంచి బృందం తోడైతే వచ్చే ఫలితమే ఇది'' అన్నారు రచయిత హర్షవర్ధన్‌.

    English summary
    After acquiring a critical acclaims from critics with “Gunde Jaari Gallanthayyinde” movie Nithin is on full josh. This high vigorous hero had received good compliments for his acting skills. Updated news is that he accepted to do a film with director Ashok of “Pilla Jamindar” and “Sukumarudu” fame. Sources close to director revealed that this film will be a re-make of his onscreen pair Nithya Menon’s Malayalam super hit “Ustad Hotel”. The story of this film is under script work where heroine and remaining cast are not yet confirmed. In the mean time our hero Nithin is busy with “Courier Boy Kalyan”.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X