తెలంగాణా సినిమా అంటే భయపడుతున్న నితిన్
తెలంగాణలో ఉన్న ఏకైక సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న నితిన్..తెలంగాణ ప్రాంతీయ చిత్రాలకి దూరంగా ఉండాలని నిశ్చయించుకున్నట్లు సమాచారం. అతన్ని హీరోగా పెట్టి తెలంగాణ యాసలో చిత్రాలు చేయటానికి ఇద్దరు ముగ్గరు నిర్మాతలు దాకా ఎప్రోచ్ అయినా నిర్విద్దంగా తిరస్కరించినట్లు చెప్పుకుంటున్నారు. తను ఆ చిత్రాల్లో చేస్తే ఓ ప్రత్యేక ప్రాంతానికి చెందిన వాడిగా భావించి ఆంధ్రా నిర్మాతలు, దర్శకులు..ముఖ్యంగా ప్రేక్షకులు తనను పట్టించుకోరనే ఈ నితిన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఎన్ శంకర్ తలపెట్టిన తెలంగాణ ఉద్యమానికి ఆధారంతో చేసే చిత్రంలోనూ నితిన్ చేయనని ఖచ్చితంగా చెప్పినట్లు వినపడుతోంది. ఇంతకు ముందు అదే దర్శకుడుతో నితిన్ రామ్ అనే చిత్రం చేసారు. అందులోనూ వరస ఫెయిల్యూర్ లలో ఉన్న నితిన్ కి అస్సలే బయిట నిర్మాతల నుంచి ఆఫర్స్ రావటం లేదు. మరో ప్రక్క చాలా కాలంగా నితన్ పాత చిత్రం మారో రిలీజవుతుందంటూ ప్రకటనలు ఇస్తున్నారు. కానీ అదీ రిలీజు కావటం లేదు. ఈ సిట్యువేషన్ లో ఏదో ఒక సినిమా అని కమిట్ అయిపోమని సన్నిహితులు అంటున్నా నితిన్ తెలంగాణా చిత్రాల్లో చేయనని స్పష్టం చేసినట్లు అంతర్గత వర్గాల సమాచారం.


Click it and Unblock the Notifications











