సునీల్ నో అన్నాడు... నితిన్ ఓకే చేసాడు

వివరాల్లోకి వెళితే... మహిళా దర్శకురాలు బి.జయ ఆ మధ్యన ఓ స్క్రిప్టుని హీరో సునీల్ కోసం రెడీ చేయించింది. పూర్తి ఫన్,కొద్దిగా యాక్షన్ తో సాగే ఆ స్క్రిప్టుని సునీల్ చేస్తానని మాట ఇచ్చి నెలలు తరబడి గెంటుకు వస్తున్నాడు. దాంతో రీసెంట్ గా నితిన్ ని కలిసిన బి.జయ నేరేట్ చేయటం జరిగిందని, దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. అయితే నితిన్ కూడా వరసగా సినిమాలు చేస్తున్నాడు. మరి డేట్స్ ఎలా కేటాయిస్తాడో చూడాలంటున్నారు.
మరో ప్రక్క 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్' దర్శకుడు మేర్లపాక గాంధీతో రామ్ కి అనుకున్న ప్రాజెక్టు సైతం ఇప్పుడు నితిన్ వద్దకు చేరిందని ఫిల్మ్ నగర్ సమాచారం. కథల ఎంపికలో డైలమాలో ఉన్న రామ్ ...'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్' హిట్టవగానే చిత్ర దర్శకుడు గాంధీని పిలిచి కథ వినటం జరిగింది. అంతా ప్రాజెక్టు ఖరారు అవుతుంది,రామ్ కెరీర్ మళ్లీ గాడిలో పడుతుందనుకున్నారు. కానీ కథలో రామ్ చెప్పిన మార్పులు,చేర్పులు చెయ్యటం కన్నా హిట్ లలో ఉన్న హీరో నితిన్ తో వెళ్లటం బెస్ట్ అని దర్శకుడు నిర్ణయం తీసుకుని జంప్ అయిపోయినట్లు చెప్తున్నారు.
ఇక పూరి జగన్నాథ్ స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తున్న చిత్రం 'హార్ట్‌ఎటాక్' విడుదలకు సిద్దంగా ఉంది. నితిన్, అదాశర్మ జంటగా నటించారు. చిత్రీకరణ పూర్తయింది. చిత్రాన్ని జనవరి 31న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ''పూరి జగన్నాథ్‌గారితో ఓ మంచి సినిమా చేయాలన్న కోరిక నెరవేరింది. 'హార్ట్‌ఎటాక్' చిత్రం నా ప్రయాణానికి మేలి మలుపు అవుతుంది''అన్నారు నితిన్. ఈ చిత్రానికి పాటలు: భాస్కరభట్ల, ఛాయాగ్రహణం: అమోల్ రాథోడ్, కూర్పు: ఎస్.ఆర్.శేఖర్, కళ: బ్రహ్మ కడలి, ఫైట్స్: రామ్‌లక్ష్మణ్, సమర్పణ: లావణ్య.


Click it and Unblock the Notifications











