ఓవర్‌గా డిమాండ్ చేస్తున్న నితిన్!
దీంతో రెమ్యూనరేషన్ ప్రస్తుతం తీసుకుంటున్న దానికంటే భారీగా పెంచాడని ఫిల్మ్ నగర్ టాక్. గతంలో కోటి గీత దాటని నితిన్ రెమ్యూనరేషన్ ఇప్పుడు మరీ టూమచ్‌గా రూ. 4 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు వినికిడి. రెండు వరుస హిట్లు కొట్టినంత మాత్రాన ఇంత రెమ్యూనరేషనా? ఇది మరీ ఓవర్ అని అంటున్నారు కొందరు నిర్మాతలు.
ప్రస్తుతం నితిన్ 'కొరియర్ బాయ్ కళ్యాణ్' చిత్రం షూటింగులో బిజీగా గడుపుతున్నాడు. గౌతం మీనన్ నిర్మిస్తున్న ఈచిత్రానికి ప్రేమ్ సాయి దర్శకత్వం వహిస్తున్నారు. యామి గౌతం నితిన్ సరసన హీరోయిన్. కార్తీక్ ఈచిత్రానికి సంగీతం అందిస్తున్నారు. సత్యం రాజేష్, హర్ష, జైసంతానం, వి.టి.వి.గణేష్ తదితరులు నటిస్తున్నారు.
ఈ చిత్రానికి సంగీతం: కార్తీక్, ఎడిటింగ్: ఆంథోనీ, కెమెరా: ఓంప్రకాష్, నిర్మాత: గౌతం వాసుదేవమీనన్, దర్శకత్వం: ప్రేమ్‌సాయి. ఈ సినిమాల తర్వాత మరో రెండు ప్రాజెక్టులు నితిన్‌కు ఖరారయినట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications












