నితిన్, జగపతి బాబు కాంబినేషన్ లో చౌదరి చిత్రం
గోపీచంద్ ని హీరోగా చేసి యజ్ఞం వంటి హిట్ ఇచ్చిన రవికుమార్ చౌదరికి ఆ చిత్రం తర్వాత హిట్లు అనేవి అసలు లేవు. అయితే తనకు లైఫ్ ఇచ్చిన పోకూరి బాబూరావు ఈతరం బ్యానర్ పై రీసెంట్ గా ఏం పిల్లో..ఏం పిల్లడో తీసి విజయం కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ క్రమంలో మరో చిత్రం నిర్మాతకి ఓ మల్టి స్టారర్ ఫిల్మ్ ప్లాన్ చేసాడు. ఆ మల్టి స్టార్స్ మరెవరో కాదు...అవకాశాల్లేని నితిన్, డబ్బు చేతిలో పెడితే మరేమీ ఆలోచించకుండా డేట్స్ ఇచ్చే జగపతి బాబు. వాళ్ళిద్దరి కాంబినేషన్ లో లక్ష్యం లాంటి హిట్ కొడతానని మాట ఇచ్చి నిర్మాతలును ఒప్పించాడుట రవికుమార్ చౌదరి. మనస్సు పెడితే మరో యజ్ఞం తీసి ఇస్తాడని నమ్మి అడ్వాన్స్ ఇచ్చిన నిర్మాతలు ఆనందంగా ఉన్నారుట. వారి ఆనందాన్ని నిలిపి సినిమా హిట్టివ్వాలని ఆశిద్దాం.
నితిన్ జగపతి బాబు యజ్ఞం గోపీచంద్ ఏం పిల్లో ఏం పిల్లడో పోకూరి బాబూరావు nitin jagapathi babu yagnam gopichand


Click it and Unblock the Notifications