నిజమా? : లాభంలో వాటా అడిగిన త్రివిక్రమ్

By Srikanya

హైదరాబాద్ : త్రివిక్రమ్‌ దర్శకత్వంలో నితిన్‌ హీరో గా ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సమంత హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రాన్ని హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు.

ఈ చిత్రం నిమిత్తం త్రివిక్రమ్ ..రెమ్యునేషన్ వద్దన్నట్లు సమాచారం. సన్నాఫ్ సత్యమూర్తి చిత్రం అనుకున్న స్ధాయిలో ఆడకపోవటంతో ఈ చిత్రానికి రెమ్యునేషన్ వద్దని, కేవలం లాభాల్లో వాటా అడిగారని తెలుస్తోంది.

Trivikram
రీసెంట్ గా షూటింగ్ ప్రారంభం అయిన ఈ చిత్రానికి 'అ ఆ' అనే పేరును ఖరారు చేశారు. 'అనసూయ రామలింగం వర్సెస్‌ ఆనంద్‌ విహారి' అనేది ఉపశీర్షిక. ఇందులో మరో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్‌ని ఎంపిక చేసుకొన్నారు. మలయాళంలో ఘన విజయం సాధించిన 'ప్రేమమ్‌'తో పేరు సంపాదించింది అనుపమ.

నిర్మాత మాట్లాడుతూ ''త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఇదివరకు 'జులాయి', 'సన్నాఫ్‌ సత్యమూర్తి' చిత్రాల్ని నిర్మించాం. మా కలయికలో మూడో చిత్రంగా 'అ ఆ' రూపొందుతోంది. తొలిసారి నితిన్‌ సరసన సమంత నటిస్తోంది. వచ్చే సంక్రాంతికి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం'' అన్నారు.

రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ 5 నుండి మొదలు పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు. తమిళ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. తెలుగు స్టార్ డైరెక్టర్లలో ఒకరైన దర్శకుడు త్రివిక్రమ్ దాదాపు టాప్ పొజిషన్లో ఉన్న హీరోలతోనే సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నాడు మొదటి నుండీ.

Trivikram 2

దర్శకుడిగా తన తొలి సినిమా తరుణ్ హీరోగా ‘నువ్వే నువ్వే' తప్ప మిగతా వన్నీ ఆయన మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ లతో చేసినవే. ఈ ముగ్గురు హీరోలతో రెండేసి సినిమాలు చేసాడు త్రివిక్రమ్.

చాలా కాలం తరువాత త్రివిక్రమ్ రూటు మార్చారు. నితిన్ లాంటి మధ్య స్థాయి హీరోతో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. సాధారణంగా త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా అనగానే పెద్ద స్టార్స్, భారీ తారాగణం, దేవిశ్రీ ప్రసాద్ లాంటి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లు ఉంటారు.

కానీ నితిన్ హీరోగా తెరకెక్కించబోయే సినిమాకు కోలీవుడ్లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ ను ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు తెలుగు సినిమాటోగ్రాపర్లనే తన సినిమాలకు ఎంపిక చేసుకున్న త్రివిక్రమ్ ఈ సినిమాకు సౌతిండియాలోని ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రాజీవ్ మీనన్ ను ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది.

త్రివిక్రమ్ తీరు చూస్తుంటే.... ఈ సారి ఆయన తన గత సినిమాలకు పూర్తి భిన్నమైన, రొటీన్ కు భిన్నమైన సినిమాలు చేయాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్లు చర్చించుకుంటున్నారు. మణిరత్నం దగ్గర పని చేసిన సినిమాటోగ్రాఫర్ రాజీవ్ మీనన్ ఈ మధ్య సినిమాల కంటే డాక్యుమెంటరీలే ఎక్కవగా చేస్తున్నారు. త్రివిక్రమ్ ప్రయోగాత్మక సినిమాలు చేస్తున్నడనే ప్రచారం సాగుతోంది.

సంగీతం: అనిరుధ్‌, ఛాయాగ్రహణం: నటరాజ్‌ సుబ్రమణియన్‌, కళ: రాజీవన్‌, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, సౌండ్‌ డిజైనింగ్‌: విష్ణుగోవింద్‌, శ్రీశంకర్‌

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X