పవన్ పాటతో నితిన్ కొత్త చిత్రం టైటిల్
హైదరాబాద్ : పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని అయిన నితిన్ ఇష్క్ ఆడియోకి పవన్ కళ్యాణ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వరస ప్లాపుల్లో ఉన్న నితిన్ కి ఆ సినిమా హిట్టవటంతో పవన్ సెంటిమెంట్ గా మారింది. తన సినిమాలో ఎక్కడో చోట పవన్ కి సంభందించిన వి ఇమర్చాడలని నిర్ణయించుకున్నట్లున్నాడు. ఆ మద్య గౌతమ్ మీనన్ నిర్మాతగా చేస్తున్న చిత్రానికి కొరియర్ బోయ్ కళ్యాణ్ అని పెట్టిన నితిన్ట తన తాజా చిత్రానికి గబ్బర్ సింగ్ లో హిట్ సాంగ్ దిల్ సే లైన్ ని పెట్టాలని ఫిక్స్ అయ్యాడని తెలుస్తోంది. అదే 'గుండె జారి గల్లంతయ్యిందే'. ఇప్పటికే గబ్బర్ సింగ్ చిత్రంలో సూపర్ హిట్ సాంగ్ కెవ్వు కేక ను టైటిల్ గా పెట్టి అల్లరి నరేష్ సినిమా ప్రారంబించారు.
నితిన్, నిత్యా మీనన్ కాంబినేషన్ లో రూపొందిన ఇష్క్ చిత్రం ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. చాలా కాలం తర్వాత హిట్ కొట్టిన నితిన్ మరింత ఉత్సాహంతో వరస ప్రాజెక్టులను ఓకే చేస్తున్నారు. ఈ కోవలో తాజాగా విజయ్ అనే నూతన దర్శకుడు ప్రాజెక్టు ఓకే చేసారు. ఇష్క్ నిర్మాతలే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అలాగే నితిన్ సరసన నిత్యా మీనన్ నే ఎంపిక చేసారు. అలాగే ఇష్క్ తల్వార్ అనే కొత్త అమ్మాయిని కూడా ఈ చిత్రంకి ఎంపిక చేసారు.
ఇక ఈ చిత్రం ఈ రోజు(సెప్టెంబర్ 19న) ప్రారంభం కానుందని నితిన్ తన ట్వీట్ లో తెలియచేసారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ చిత్రం గురించి నితిన్ మాట్లాడుతూ.. నిత్యా మీనన్ తో మరోసారి కలిసిపనిచేయటం చాలా ఆనందంగా ఉంది. ఇష్క్ లో ఆమెతో కలిసి పనిచేయటం మెమరబుల్ ఎక్సపీరియన్స్. మరోసారి ఆ మ్యాజిక్ ని రిపీట్ చేయాలని అనుకునంటున్నాను అన్నారు.
ప్రస్తుతం నితిన్.. కొరియర్ బోయ్ కళ్యాణ్ చిత్రం చేస్తున్నారు. నితిన్ హీరోగా ఫోటాన్ కథాస్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రారంభమైన చిత్రం 'కొరియర్‌బోయ్ కళ్యాణ్'. ప్రేమ్‌సాయి దర్శకత్వంలో గౌతమ్ వాసుదేవమీనన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ద్విభాషా చిత్రంగా తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్న ఈ సినిమా ని నిర్మిస్తున్నారు. తమిళంలో 'తమిళ సెల్వనుం తనియార అంజలుం' పేరుతో రూపొందిస్తున్నారు. ముఖ్య పాత్రలో జై, సంతానం, వి.టి.వి గణేష్ నటిస్తుండగా మిగతా పాత్రల ఎంపిక జరగనుంది. రెగ్యులర్ షూటింగ్‌కి త్వరలోనే వెళ్లనున్న ఈ చిత్రానికి సంగీతం: కార్తీక్, నిర్మాత: గౌతమ్ వాసుదేవ మీనన్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ప్రేమ్‌సాయి.


Click it and Unblock the Notifications











