పవర్ స్టార్ హీరోయిన్ను దక్కించుకున్న నితిన్?
యంగ్ హీరో నితిన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వీరాభిమాని అనే విషయం తెలిసిందే. ఇటీవల విడుదలైన తన తాజా సినిమా 'ఇష్క్' చిత్రం ఆడియో వేడుకకు పవర్ స్టార్‌ను ఆహ్వానించి తన కోరిక తీర్చుకున్నాడు. తాజాగా నితిన్ మరో లక్కీ చాన్స్ కొట్టేశాడు. పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'గబ్బర్ సింగ్' చిత్రం హీరోయిన్ శృతి హాసన్‌తో రొమాన్స్ చేసే అవకాశం దక్కించుకున్నాడు.
వివరాల్లోకి వెళితే....
వరుస ప్లాపుల తర్వాత 'ఇష్క్' చిత్రంతో హిట్ కొట్టిన నితిన్ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఈచిత్రం తర్వాత 'ఈరోజుల్లో' దర్శకుడు మారుతితో నితిన్ నటించబోతున్నాడనే వార్తలు వచ్చినప్పటికీ, ఆ ప్రాజెక్టు ఓకే కాలేదు. ప్రముఖ నిర్మాత బెల్లకొండ సురేష్ నితిన్ హీరోగా సినిమా తీయాలని కొన్ని రోజులుగా ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు తమిళ దర్శకుడు విజయ్ దర్శకత్వంలో నితిన్‌ను ఒప్పించినట్లు తెలుస్తోంది.
ఈ చిత్రంలో నితిన్ సరసన 'శృతి హాసన్'ను హీరోయిన్‌గా ఖరారు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కొలవెరి 3 చిత్రానికి సంగీతం అందించిన అనిరుద్ రవిచందర్ ఈ సినిమాకు సంగీతం అందించనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
సినిమాల్లోకి వచ్చి చాలా కాలమైనా సరైన హిట్ లేని శృతి హాసన్‌కు మాత్రం అవకాశాల పరంగా మాత్రం ఢోకాలేకుండా పోతోంది. కారణం ఆమె అందం, అభినయం ప్రేక్షకులకు నచ్చడమే. దీంతో పెద్ద హీరో, చిన్న హీరో, దర్శకుడు, నిర్మాత అనే తేడాలు లేకుండా హిట్టు కొట్టడమే లక్ష్యంగా సైన్లమీద సైన్లు చేసుకుంటూ వెలుతోంది శృతి. ప్రస్తుతం ఆమె గబ్బర్ సింగ్ చిత్రంపై బోలెడు ఆశలు పెట్టుకుంది.


Click it and Unblock the Notifications











