»   » నితిన్, పూరి కొత్త చిత్రం టైటిల్ ఇదే

నితిన్, పూరి కొత్త చిత్రం టైటిల్ ఇదే

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : టైటిల్స్ పెట్టడంలో పూరి జగన్నాథ్ ని మించిన వారు లేరనేది తెలుగు ఇండస్ట్రీలో ఎప్పటినుంచో ఉన్న మాట. ఇడియట్, దేశముదురు, అమ్మ నాన్న తమిళ అమ్మాయి, నేను నా రాక్షసి, కెమెరామెన్ గంగతోరాంబాబు, టెంపర్, ఏక్ నిరంజన్, ఆధ్రావాలా, ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, బుజ్జిగాడు మేడిన్ చెన్నై, హార్ట్ ఎటాక్, జ్యోతి లక్ష్మి, ఇలా ప్రతీసారీ ఆయన కొత్తగా విభిన్నంగా టైటిల్ తో వస్తూ అలరిస్తూ, ప్రాజెక్టుపై ఆసక్తిని పెంచుతూ వస్తున్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఇప్పుడు కూడా అదే రీతిలో నితిన్ తో చేస్తున్న కొత్త చిత్రానికి ఆయన విభిన్నమైన టైటిల్ ని ఎంచుకున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆయన ఫిల్మ్ ఛాంబర్ లో రిజిస్టర్ చేసినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఆ టైటిల్ ఏంటీ అంటారా... "మా అమ్మ సీతామహాలక్ష్మి". ఈ టైటిల్ వినగానే కుటుంబ అనుబంధాలతో నడిచే కథ అన్న విషయం స్పష్టమవుతుంది. అందుకే పూరి ఈ టైటిల్ ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది.

ఇటీవల 'చిన్నదాన నీకోసం' అంటూ సందడి చేసిన ఆయన తదుపరి పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో నటించనున్నారు. 'నా అభిమాన దర్శకుల్లో ఒకరైన పూరి జగన్నాథ్‌తో మరో చిత్రం చేస్తున్నా'నని స్వయంగా వెల్లడించాడు నితిన్‌. వీరి కలయికలో ఇదివరకు 'హార్ట్‌ ఎటాక్‌' తెరకెక్కింది. తన కొత్త సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాల్ని త్వరలోనే వెల్లడిస్తానని నితిన్‌ తెలిపాడు.

Nitin,puri Jagan movie title...Maa Amma Seetamalakshmi

ప్రేమకథలతోనే మాస్‌ ఇమేజ్‌ను సొంతం చేసుకొన్న హీరో నితిన్‌. 'జయం', 'దిల్‌', 'సై', 'ఇష్క్‌', 'గుండెజారి గల్లంతయ్యిందే' తదితర చిత్రాలతో విజయాలు సొంతం చేసుకొన్నాడు. ఒకపక్క కథానాయకుడిగా నటిస్తూనే, మరోపక్క నిర్మాతగా కూడా మారాడు. అఖిల్‌ అక్కినేనిని హీరో గా పరిచయం చేస్తూ నితిన్‌ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే.

పూరి చేస్తున్న తాజా చిత్రం జ్యోతిలక్ష్మీ విషయానికి వస్తే...

ఛార్మి, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో రూపొందనున్న జ్యోతిలక్ష్మి చిత్రం ముహూర్తం జరిగింది. ఈ నేపధ్యంలో ఆమె ఈ సెక్సీ ఇమేజ్ ని షేర్ చేస్తూ ముహూర్తం జరిగిందని తెలియచేసింది.

ఫుల్ జోరుమీదున్న స్పీడ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్. జూనియ‌ర్ ఎన్టీఆర్ టెంప‌ర్ సినిమా పూర్త‌వ‌టంతో త‌న భ‌విష్య‌త్ సినిమాల ప‌నిలో ప‌డిపోయాడు. ఛార్మింగ్ బ్యూటీ ఛార్మీతో కొత్త సినిమా తీయ‌బోతున్నాడు. ఈ విష‌యాన్ని పూరీ జ‌గ‌న్నాథ్ తెలిపాడు. త‌ను ఛార్మీ తో తీయ‌బోయే సినిమా పేరు జ్యోతిలక్ష్మి అని వెల్ల‌డించాడు. అయితే ఈ సినిమా నర్త‌కి జీవిత కథాంశంతో రూపొందిస్తున్నామ‌ని వెల్ల‌డించాడు.

పేరు క్యాచీగా ఉండాల‌ని ఆలోచిస్తే జ్యోతిలక్ష్మి అయితే బాగుంటుంద‌ని అది ఓకే చేశామ‌ని. అంతేగానీ ఈ సినిమా జ్యోతిల‌క్ష్మి నిజ జీవితానికి సంబంధం లేద‌ని పేర్కొన్నారు. ఈ చిత్రం పూర్తికాగానే మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు త‌న‌యుడు వ‌రుణ్ తేజ్ హీరోగా ఓ సినిమా తీస్తున్నట్లు తెలిపాడు.

English summary
Now it is being said that Puri has registered title as ."Maa Amma Seetamalakshmi" for Nitin film.
Please Wait while comments are loading...