'గబ్బర్ సింగ్'లో గెస్ట్‌గా ఆ యంగ్ హీరో?
పవన్ కళ్యాణ్ తాజా చిత్రం గబ్బర్ సింగ్ లో యంగ్ హీరో నితిన్ నటిస్తున్నాడంటూ వార్తలు ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. అయితే అతను పాత్రను కేవలం తెరపైన మాత్రమే చూడాలని అప్పటివరకూ సీక్రెట్ గా ఉంచాలని దర్శక, నిర్మాతలు భావించినట్లు తెలుస్తోంది. నితిన్ తో వచ్చే సన్నివేశాలను ఆల్రెడీ రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరించారని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో ఆ సీన్స్ రానున్నాయని తెలుస్తోంది. ఇక ఆ పాత్ర సర్పైజింగ్ గా ఉంటుందని అంటున్నారు. పవన్ కళ్యాణ్ కి నితిన్ వీరాభిమాని కావటంతో ఇలా చిన్న గెస్ట్ రోల్ అయినా మారు మాట్లాడకుండా ఒప్పుకున్నాడని చెప్పుకుంటున్నారు.
అయితే ఈ మధ్యనే నితిన్ తాజా చిత్రం ఇష్క్ ఆడియో ఫంక్షన్ కి సైతం స్పెషల్ గెస్ట్ గా పవన్ కళ్యాణ్ వెళ్లి వచ్చారు. అది బేస్ చేసుకునే ఈ వార్తను ప్రచారంలోకి తీసుకు వచ్చారని కొందరు అంటున్నారు. అయితే నితిన్ గెస్ట్ గా కనిపించినా పెద్ద ఆశ్చర్యమేమీ లేదనేది నిజం. ఎందుకంటే పవన్ చిత్రం అంటే అందరికీ క్రేజే కదా. ఇక గబ్బర్ సింగ్ చిత్రంలో హీరోయిన్ గా శృతిహాసన్ నటిస్తోంది. మిరపకాయతో నిరూపించుకున్న హరీష్ శంకర్ ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నారు. బాలీవుడ్ లో హిట్టైన దబాంగ్ కి ఇది రీమేక్. ఇందులో పవన్ మాస్ లుక్ తో కూడిన పోలీస్ అధికారిగా కనపిస్తారు.


Click it and Unblock the Notifications











