పవన్ కళ్యాణ్ తో పాటు మహేష్ బాబుని టార్గెట్ చేస్తున్నాడు..!
హిట్టెలా ఉంటుందో మర్చిపోయి చాలా కాలమతున్న నితిన్ త్వరలో 'ఇష్క్" సినిమాతో మళ్లీ అసలు తమ ఫేసు తెర మీద ఎలా ఉంటుందనేది తెలుసుకోబోతున్నాడు. ఇప్పటికే జనం తననిక మరచిపోవడంతో, తనెవరనేది కొందరికైనా గుర్తు చేయాలని నితిన్ పక్కదారులు నమ్ముకుంటున్నాడు. స్టార్ హీరోల అభిమానుల్ని తన కామెంట్స్ తో ఆకట్టుకోవడానికి నితన్ తరచుగా ప్రయత్నిస్తూ ఉంటాడు.
ముఖ్యంగా పవన్ కళ్యాణ్ నేనో పెద్ద ఫ్యాన్ అని చెప్పుకొనే నితిన్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని టార్గెట్ చూస్తూ కామెంట్స్..కాంప్లిమెంట్లు ఇస్తుంటాడు..ప్రస్తుతం మరో హీరోని టార్గెట్ గా పెట్టుకొని అతని ఫ్యాన్స్ ని పడగొట్టే పనిలో ఉన్నాడు....ఆ హీరో ఎవరో కాదు ప్రిన్స్ మహేష్ బాబు. పవన్ సినిమా వచ్చే ముందు అతని భజన చేసే నితిన్ 'దూకుడు" రిలీజ్ కి రెడీ అవడంతో కొత్తగా మహేష్ దూకుడు పై భజన చేస్తున్నట్టు సమాచారం. ఈ సినిమాలో ఇది బాగుంది, అది బాగుంది అంటూ తన వంతుగా తప్పెట మోగిస్తున్నాడు. అయితే ఇతనెంత కష్టపడ్డా ఇతడిని ఆయా హీరోల అభిమానులు హీరోగా గుర్తిస్తున్న దాఖలాలు లేవు..


Click it and Unblock the Notifications











