అక్కినేని అఖిల్ తొలి సినిమాకు నిర్మాత హీరో నితిన్?
హైదరాబాద్: నాగార్జున చిన్న కుమారుడు అక్కినేని అఖిల్ త్వరలో హీరోగా పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే. ‘మనం' సినిమాలో అఖిల్ గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చినప్పటి నుండి అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ సినిమాలో అఖిల్ ని చూసి మెస్మరైజ్ అయిన అభిమానులు ఈ సిసింద్రి హీరోగా ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడా అని ఎదురుచూస్తున్నారు. మరో పక్క, అఖిల్ హీరోగా ఓ సినిమా 2015కల్లా కచ్చితంగా ప్రేక్షకుల ముందుకు వస్తుందని ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి.

తాజా సమాచారం ప్రకారం, వివినాయక్ దర్శకత్వంలో అఖిల్ హీరోగా ఓ సినిమా స్టార్ట్ అవబోతోందట. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా వివి వినాయక్ రూపొందించిన "అల్లుడు శీను" బాక్స్ ఆఫీసు వద్ద సందడి చేసింది. దాంతో, నాగార్జున స్వయంగా వివి వినాయక్ ని కలిసి, అఖిల్ ఫస్ట్ ఫిల్మ్ కి దర్శకత్వం వహించమని కోరాడని సమాచారం.
ఈ చిత్రాన్ని తొలుత తన సొంత బేనర్లోనే నిర్మించాలని నాగార్జున అనుకున్నప్పటికీ...తన బేనర్లో నిర్మిస్తానంటూ హీరో నితిన్ ముందుకు వచ్చినట్లు ఫిల్మ్ టాక్. నితిన్‌కు చెందిన శ్రేష్ఠ్ మూవీస్ బేనర్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశం ఉంది. మరి ఈ వార్తలో నిజం ఎంతో తేలాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











