'అలా మొదలైంది' నిత్యామీనన్ వరస ఫ్లాపుల హీరోతో...
అలా మొదలైంది చిత్రంతో పరిచయమైన నిత్యా మీనన్ కి తెలుగులో చాలా ఆఫర్స్ వచ్చాయి. అయితే ఆమె ఎత్తు తక్కువ ఉండటం, హోమ్లీ ఫేస్ కావటం వంటి విచిత్రమైన కారణాలతో అవేమీ వర్కవుట్ కాలేదు. అయితే తాజాగా ఆమె నితిన్ ప్రక్కన ఎంపికైంది. వరస ఫ్లాపులో దూసుకుపోతున్నా తన ప్రక్కన హీరోయిన్ మాత్రం స్టార్ కావాలనుకునే నితిన్ వెంటనే ఆమెకు ఓటేసి ఒప్పించాడు. గతంలో తెలుగులో ఇష్టం సినిమాకు దర్శకత్వం వహించి ఇటీవల 13 బి (మాధవన్, నీతూ చంద్ర) అనే బాలీవుడ్ చిత్రాన్ని రూపొందించిన విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది.
పి.సి.శ్రీరామ్ కెమెరా వర్క్ చేస్తున్న ఈ చిత్రం రీసెంట్ గా గోవా లో షూటింగ్ జరుపుకుంది. విక్రమ్ తన తాజా చిత్రానికి నితిన్ ని హీరోగా ఎంపిక చేసుకున్నాడు. 13 బి తర్వాత విక్రమ్ తన తదుపరి చిత్రం విక్రమ్ తో చేస్తారని అనుకున్నారు. అయితే చివరి నిముషంలో ఆ ప్రాజెక్టు కాన్సిల్ అయింది. విక్రమ్ స్క్రిప్టులో చెప్పిన మార్పులు నచ్చక విక్రమ్ తాను ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్లు ప్రకటించాడు.


Click it and Unblock the Notifications











