మహేష్‌బాబు అయితేనే చేస్తాను... ఎన్టీఆర్ అయితేనే నా దగ్గరకు రండి
యువ హీరోల సినిమాలయితేనే నా దగ్గరకు రండి. సీనియర్ హీరోలు ఎంత పెద్ద హీరోలయినా సరే.. ఆ సినిమాలు చేయడానికి నేను ఇష్టపడను" అని నిక్కచ్చిగా చెబుతోంది నిత్యామీనన్. 'అలా మొదలైంది" చిత్రంతో పరిచయమైన నిత్యా మీనన్ ఆ సినిమా హిట్టవటంతో కంటిన్యూగా ఆఫర్స్ వస్తున్నాయి. ఈ సందర్భంగా ఆమె ఆచితూచి అడుగులు వేస్తోంది. అలాగని యంగ్ హీరోలు అన్నాను కదా అని కొత్త హీరోలతో చేసేది లేదు అంటోంది. దాంతో నిత్యామీనన్..మహేష్‌బాబయితేనే చేస్తాను.
ఎన్టీఆర్ అయితేనే నా దగ్గరకు రండి " అంటూ తెగ ఫోజులు కొడుతోందని ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్పుకుంటున్నారు. అయితే ఆమె కెరీర్ ప్రారంభంలో దాదాపు అరవైకి దగ్గరపడుతున్న మళయాళ హీరో మోహన్‌లాల్ హీరోగా చేసిన సినిమా ద్వారా హీరోయిన్‌గా పరిచయమైంది. దాంతో ఆమె మాటలు విన్నవారు... ఒక సినిమా హిట్టయ్యేసరికి ఇలా ఫోజులు కొడుతోందని అంటున్నారు. ప్రస్తుతం ఆమె నాని సరసన 'సెగ"చేస్తోంది. ఈ చిత్రంతో అంజన హీరోయిన్ గా చేస్తోంది.


Click it and Unblock the Notifications











