సాయి పల్లవికి పోటీగా నిత్య మీనన్.. ఆ సినిమా వస్తే మరో లైఫ్ వచ్చినట్లే?

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ మధ్య పోటీ హై రేంజ్ లో ఉంటుంది. ఒక్క హిట్టు పడినా కూడా వేరే హీరోయిన్స్ కు రావాల్సిన ఆఫర్స్ కొన్నిసార్లు మరో హీరోయిన్ కు వెళ్లిపోవచ్చు. చాలా వరకు టాలెంట్ తో పాటు సక్సెస్ రేట్ కూడా ఉండాలని దర్శక నిర్మాతలు ఆలోచిస్తుంటారు. ఇక ప్రస్తుతం సాయి పల్లవి vs నిత్య మీనన్ అన్నట్లుగా ఒక టాక్ అయితే వైరల్ గా మారింది.

 ఇద్దరు ఒకేలా..

ఇద్దరు ఒకేలా..


సాయి పల్లవి, నిత్య మీనన్.. దాదాపు ఈ ఇద్దరు ఒకే క్యాటగిరికి చెందిన వారు. ఎవరి స్టైల్ లో వారికి సొంత టాలెంట్ ఉన్నప్పటికీ రెమ్యునరేషన్ కోసం టెంప్ట్ అయ్యే రకం కాదు. పెద్ద సినిమలైనా స్టార్ హీరో సినిమలైనా సరే కంటెంట్ ఉంటేనే సినిమా చేయడానికి ఒప్పుకుంటారు. కథలో పాత్ర ఎంతవరకు బలంగా ఉందనే విషయంపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తుంటారు.

ఎరుపు చీరలో కనువిందు చేసిన జాక్వలైన్ ఫెర్నాండేజ్..

పెద్ద సినిమాల్లో..

పెద్ద సినిమాల్లో..

అయితే నిత్య మీనన్ గత కొంతకాలంగా డౌన్ అవుతూ వస్తోంది. పెద్దగా ఆఫర్స్ ఏమి రావడం లేదు. చివరగా ఆమె నిన్నిలా నిన్నిలా అనే ఒక చిన్న సినిమాల్లో నటించింది. ఇక తెలుగులో జనతా గ్యారేజ్ లాంటి ఆఫర్ ఇంతవరకు రాలేదు. అప్పుడప్పుడు కొన్ని సినిమాల్లో గెస్ట్ రోల్స్ చేస్తూ వస్తోంది.

 మహానటి రిజెక్ట్ చేయడంతో..

మహానటి రిజెక్ట్ చేయడంతో..

మహానటి లాంటి సినిమా ఆఫర్ వచ్చినప్పుడు నిత్య ఎందుకు రిజెక్ట్ చేసిందో గాని ఆ సినిమా చేసి ఉంటే ఆమె కెరీర్ మరోలా ఉండేదనే కామెంట్స్ వచ్చాయి. బాలకృష్ణ చేసిన ఎన్టీఆర్ బయోపిక్ లో ఆమె చేసిన సావిత్రి పాత్రకు అంతగా గుర్తింపు అయితే రాలేదు. పైగా ఆ సినిమా కూడా ప్లాప్ అయ్యింది.

 ఆ ఆఫర్ వస్తే..

ఆ ఆఫర్ వస్తే..


నిత్య మీనన్ ఏదైనా సినిమా చేయడానికి ఒప్పుకుంది అంటే ఆ సినిమాపై స్పెషల్ బజ్ క్రియేట్ అవ్వడం కాయం. అంతగా సక్సెస్ అవుతూ వచ్చిన ఈ బ్యూటీకి ఈ మధ్య ఆఫర్స్ తగ్గాయి. అయితే ఫైనల్ గా సాయి పల్లవి చేయాల్సిన ఒక సినిమా ఆఫర్ నిత్య మీనన్ వైపు వెళ్లినట్లు తెలుస్తోంది. ఆ ఆఫర్ వస్తే ఇష్క్ బ్యూటీ మళ్ళీ ఫామ్ లోకి వచ్చే అవకాశం ఉంటుంది.

Recommended Video

Pawan Kalyan - Rana Daggubati MultiStarer : టైటిల్ గా చిరు పాత హిట్ మూవీ, పారితోషికం వివరాలు !
 పవన్ కళ్యాణ్ కు జోడిగా

పవన్ కళ్యాణ్ కు జోడిగా

ఆ సినిమా ఆఫర్ మరేదో కాదు. పవన్ కళ్యాణ్ , రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న అయ్యప్పనుమ్ కొశీయుమ్ రీమేక్. రానా కోసం ఐశ్వర్య రాజేష్ ను హీరోయిన్ గా ఫిక్స్ చేయగా పవన్ కళ్యాణ్ కు జోడి ఎవరనేది ఇంకా ఫిక్స్ అవ్వలేదు. సాయి పల్లవిని అనుకున్నప్పటికి ఆమెకు డేట్స్ దొరకడం లేదని టాక్ వస్తోంది. ఇక ఫైనల్ గా నిత్య మీనన్ ను సెలెక్ట్ చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ విషయంలో ఆమె లక్ ఎలా ఉందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X