»   » నిత్యా మీనన్ లవ్ ఎఫైర్ విత్...

నిత్యా మీనన్ లవ్ ఎఫైర్ విత్...

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Nitya Menon
  హైదరాబాద్ : నిత్యా మీనన్ ప్రేమలో పడిందా ..అవుననే అంటున్నాయి తమిళ సినీ వర్గాలు. తెలుగు,తమిళ భాషల్లో తన కంటూ బ్రాండ్ ఇమేజ్ ఏర్పాటు చేసుకుని దూసుకుపోతున్న నిత్యామీనన్...రీసెంట్ గా ఓ తమిళ హీరోతో ప్రేమలో పడిందంటున్నారు. అతను మరెవరో కాదు...క్రిష్ సదార్. నిత్యామీనన్ తాజా చిత్రం మాలిని 22 లో హీరోగా చేస్తున్న క్రిష్ తో ఆమె డేటింగ్ చేస్తోందని అక్కడ మీడియా అంటోంది. ఇద్దరూ కలిసి రెస్టారెంట్స్ కి వెళ్లటం..షాపింగ్ కు వెళ్లటం చేస్తున్నారట. అయితే ఈ విషయంపై ఎవరూ నోరు విప్పటం లేదు. నిజానిజాలు నిత్యామీనన్ కే తెలియాలి.

  చిత్రం విషయానికి వస్తే... నిత్యామీనన్, క్రిష్ సత్తార్ కీలక పాత్రల్లో నటిస్తున్న సినిమా 'మాలిని 22'. శ్రీప్రియ దర్శకత్వం వహించారు. రాజ్‌కుమార్ థియేటర్స్ ప్రొడక్షన్స్ ప్రై. లిమిటెడ్ పతాకంపై రాజ్‌కుమార్ సేతుపతి ఈ సినిమాను నిర్మించారు. అరవింద్, శంకర్ సంగీతాన్ని సమకూర్చారు. రివేంజ్ డ్రామా గా రూపొందుతున్న ఈ చిత్రం డిసెంబర్ 27న విడుదలచేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం తెలుగులో పాటు తమిళంలోనూ ఈచిత్రాన్ని విడదుల చేస్తున్నారు. తమిళంలో ఈచిత్రాన్ని '22 మాలిని పాళయం కోట్టై' పేరుతో విడుదల చేయనున్నారు.

  నిత్యామీనన్ మాట్లాడుతూ "శ్రీప్రియగారు కథ చెప్పినప్పుడు చేయడం కష్టమనిపించినా ఒప్పుకున్నాను. పాటలు బాగా కుదిరాయి. ఈ సినిమాలో నటించిన మేల్ ఆర్టిస్టులకు స్పెషల్ థాంక్స్'' అని చెప్పారు. 22 కొట్టాయం కథను తెలుగు, తమిళ భాషలకు అనుగుణంగా కొన్ని మార్పులు చేసి నిర్మించిన ఈ సినిమాలో ఓ గొప్ప సందేశం ఉంటుందని దర్శకురాలు శ్రీప్రియ సినిమాపై ఉన్న అభిరుచితో ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారని కథానాయిక నిత్యామీనన్ తెలిపారు. సున్నితమైన అంశంతో తెరకెక్కిన సినిమా అని క్రిష్ తెలిపారు.

  కోవైసరళ, కోట శ్రీనివాసరావు, విద్యురామన్, సూదుకవ్వమ్, అంజలిరావ్, హార్లిక్స్ అంకుల్, మురళి, చంద్ర తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఆర్ట్: ప్రేమ్‌శ్రీనివాస్, మాటలు: అనురాధ ఉమర్జీ, గౌతంకశ్యప్, పాటలు: అనంత్‌శ్రీరామ్, సంగీతం: అరవింద్-శంకర్, ఎడిటింగ్: భవన్ శ్రీకుమార్, కెమెరా: మనోజ్‌పిళ్లై, నిర్మాత: రాజ్‌కుమార్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీప్రియ

  English summary
  Actress Nitya Menon caught red handed with Tamil film hero Krish Sathaar who is acting in ‘Malini 22’. Both actors Nitya and Krish were romancing in secluded place during the shooting. The team was shocked to see both of them in comprising position. Nitya now says that she is in love with Krish and both are going to get married if not live to together like friends. Currently, Nitya is acting in JK Ennum Nanbanin Valhar and Malini 22 Palayamkottai.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more