పవన్ కళ్యాణ్ సిస్టర్‌గా...... ఒప్పుకుంటుందా? లేదా?
హైదరాబాద్: పవన్ కళ్యాణ్ సినిమాలో నటించడానికి చాలా మంది స్టార్స్ ఆసక్తి చూపుతుంటారు. అవకాశం వస్తే వదులుకోవడానికి ఇష్టపడరు. జంటిల్మెన్ మూవీలో నాని సరసన హీరోయిన్ గా నటించిన నివేదా థామస్ కు కూడా అలాంటి అవకాశమే వచ్చింది. అయితే ఈ విషయంలో నివేదా థామస్ ఎటూ తేల్చుకోలేక సతమతం అవుతోందట.
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మూడు సినిమాలకు కమిటైన సంగతి తెలసిందే. అందులో తమిళ దర్శకుడు నేసన్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా ఒకటి. ఎఎం రత్నం నిర్మించబోతున్న ఈ చిత్రం తమిళ హిట్ మూవీ 'వేదాళమ్' కి రీమేక్ అనే ప్రచారం జరుగుతోంది.

సిస్టర్ సెంటిమెంట్ తో సాగే ఈ చిత్రంలో పవన్ చెల్లిలి పాత్రకు ప్రముఖ తారను తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు ఇటీవలే నివేదా థామస్ సంప్రదించారని సమాచారం. పవన్ మూవీలో ఆఫర్ అనగానే సంతోష పడ్డ నివేదా థామస్... చెల్లిలి పాత్ర అని చెప్పగానే ఆలోచనలో పడిపోయిందట. హీరోయిన్ గా ఎదుగుతున్న ఈ తరుణంలో ఇలాంటి పాత్రలు చేస్తే తన కెరీర్ మీద ప్రభావం పడుతుందని భయ పడుతుందట. మరి ఆమె ఈ పాత్ర చేయడానికి ఒప్పుకుంటుందా? లేదా? అనేది తేలాల్సి ఉంది.

తమిళంలో 'జిల్లా' చిత్రాన్ని డైరెక్ట్ చేసిన ఆర్.టి.నేసన్ దర్శకత్వంలో తెరకెక్కుతున ఈ చిత్రాన్ని ఎస్.ఐశ్వర్య నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి డిసెంబరు నుండి డేట్స్ ఇచ్చినట్లు సమాచారం. డిసెంబరులో 15 రోజులు షూటింగ్ జరిపి.. జనవరిలో నిరవధికంగా రెండు షెడ్యూల్స్ తో ముగించాలని ప్లాన్ చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది.


Click it and Unblock the Notifications