కాబోయే భర్తతో బ్రేకప్? పెళ్లికి ముందే నివేత పేతురాజ్ షాకింగ్‌గా..!

ఇటీవల సెలబ్రిటీ జంటలు వరుసగా వార్తల్లో నిలుస్తున్నారు. ఎంగేజ్‌మెంట్ చేసుకుని,పెళ్లి సిద్ధం చేసుకుంటూ చివరి నిమిషంలో పెళ్లిని రద్దు చేసుకున్నారు. తాజాగా క్రికెటర్ స్మృతి మంధాన - పలా‍‌శ్ ముచ్చల్ వివాహం రద్దు కావడం ఈ చర్చను మళ్లీ మొదలు పెట్టింది. ఎలాగంటే వరుసగా ఎదురైన అనూహ్య పరిణామాల కారణంగా..పెళ్లి చివరి గంటలోనే నిలిచిపోయింది. ఈ సంఘటన మరచిపోకముందే మరో సెలబ్రిటీ పేరు సోషల్ మీడియాలో చర్చకు వస్తోంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరంటే?

ఆ హీరోయిన్ ఎవరంటే? నివేత పేతురాజ్. తెలుగులో తనదైన అభినయంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.'మెంటల్ మదిలో' సినిమాతో తెలుగు ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది నివేథా. తరువాత చిత్రలహరి, బ్రోచేవారెవరురా, చిత్రలహరి వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తన నటనతో విపరీతమైన ఆదరణ పొందింది. అల వైకుంఠపురంలో, రెడ్, పాగల్, దాస్ కధమ్కీ, బ్లడీ మేరీ వంటి సినిమాలతో నటిస్తూ వరుసగా ప్రేక్షకులను అలరించారు. స్టార్ హీరోలతో నటించినా స్టార్ హీరోయిన్ల లీగ్‌లోకి మాత్రం పూర్తిగా ఎంట్రీ ఇవ్వలేకపోయింది. అయినా పాత్రల ఎంపికలో తనదైన ప్రత్యేకతను నిలబెట్టుకుంది.

Nivetha Pethuraj Breakup Rumours Unfollowed Fianc Before Wedding Fans Shocked

నివేత పేతురాజ్ గత కొద్దికాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. ఇందుకు కారణం ఆమె పెళ్లి ఏర్పాట్లు, వ్యక్తిగత పనులే అని అప్పట్లో టాక్. కొన్ని నెలల క్రితం నివేత, తన కాబోయే భర్తగా రజ్ హిత్ ఇబ్రాన్ పరిచయం చేసింది. ఈ క్రమంలో తనతో దిగిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. అధికారికంగా ఎంగేజ్మెంట్ చేసుకున్నట్టు ప్రకటించారు.ఇద్దరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వీరి ప్రేమ,పెళ్లి చర్చకి తెరతీసింది.

రజ్ హిత్ ఇబ్రాన్ ఎవరు? అనే ప్రశ్న సోషల్ మీడియాలో చర్చనీయంగా మారింది.రజిత్ ఇబ్రాన్ ఒక మోడల్ మాత్రమే కాకుండా బిజినెస్‌మ్యాన్ కూడా. నివేథా మధురైకి చెందినదైనా, చాలా కాలంగా దుబాయ్‌లోనే పెరిగింది. ప్రస్తుతం కూడా అక్కడే నివసిస్తోంది. ఈ క్రమంలోనే రజిత్ ఇబ్రాన్‌తో పరిచయం ఏర్పడి ఉంటుందని ఇండస్ట్రీ టాక్.

అయితే.. ఆకస్మాత్తుగా హీరోయిన్ నివేత తన ఇన్‌స్టాగ్రామ్‌లో రజ్ హిత్‌ను అన్‌ఫాలో చేశారు. ఇద్దరి కలిసి ఉన్న అన్ని ఫోటోలు డిలీట్ చేశారు. ఆశ్చర్యకరంగా రజ్ హిత్ కూడా అదే పని చేశారు. నివేతను అన్‌ఫాలో చేశారు. ఫోటోలు తొలగించారు. ఈ ఇద్దరి చర్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ క్రమంలో సోషల్ మీడియాలో 'ఎంగేజ్మెంట్ క్యాన్సెల్ అయింది!', 'ఇద్దరి మధ్య ఏదో జరిగింది!' అంటూ రూమర్స్ వేగంగా ప్రచారం అయ్యాయి.

ప్రస్తుతం 35 ఏళ్ల నివేత గత రెండు సంవత్సరాలుగా కొత్త సినిమాలు ప్రకటించలేదు. పెళ్లి ఏర్పాట్ల కారణంగానే నటనకు విరామం తీసుకున్నారని ప్రచారం ఉండేది. అయితే ఎంగేజ్మెంట్ విషయంలో వచ్చిన తాజా రూమర్స్ నేపథ్యంలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. బ్రేకప్ నిజమేనా? లేక సోషల్ మీడియా అపోహలామాత్రమా? ఈ విషయంపై సమాధానం వచ్చేదాకా నెటిజన్ల చర్చ ఆగేలా లేదు. అధికారికంగా చెప్పే వరకు ఎలాంటి నిర్ణయాలకు రాకూడదు.ఇక ఈ జంట నుంచి ఎలాంటి క్లారిటీ వస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X