వెంకీ ఆదర్శ కుటుంబంలో ఐటెం బాంబ్.. ఆ బ్యూటీతో త్రివిక్రమ్ క్రేజీ ప్లానింగ్!

విక్టరీ వెంకటేష్ హీరోగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'ఆదర్శ కుటుంబం : హౌస్ నెం.47'. ఈ సినిమాపై రోజురోజుకూ ఆసక్తిని పెంచుతోంది. కుటుంబ కథా సినిమాలను తనదైన శైలిలో వినోదం, భావోద్వేగాలతో మేళవించే త్రివిక్రమ్.. ఈసారి వెంకటేష్‌తో తొలిసారి దర్శకుడిగా జతకడుతున్నారు. దీంతో వీరి కాంబో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా సాగుతుండగా, తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికర వార్త ఫిల్మ్ నగర్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

ఇప్పటికే ఈ సినిమాలో ప్రధాన కథానాయికగా శ్రీనిధి శెట్టి నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా టాలీవుడ్ చార్మింగ్ బ్యూటీ నివేదా పేతురాజ్ కూడా ఈ ప్రాజెక్టులో భాగమయ్యారనే వార్తలు సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న నివేదా.. ఈ సినిమాతోనే తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. నిజానికి నివేదా పేతురాజ్ పేరు వినగానే ప్రేక్షకులకు అందం, అభినయం రెండూ గుర్తుకు వస్తాయి. తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. వ్యక్తిగత కారణాలతో కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారు.

Nivetha Pethuraj Joins Venkatesh-Trivikram s Adarsha Kutumbam Key Role or Special Song Sparks Buzz

దీంతో ఆమె తిరిగి ఏ ప్రాజెక్టుతో రీఎంట్రీ ఇస్తారన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ఇప్పుడు ఆ అవకాశం త్రివిక్రమ్ సినిమా రూపంలో వచ్చినట్లు తెలుస్తోంది. అయితే నివేదా పాత్ర విషయంలో మాత్రం భిన్నమైన కథనాలు వినిపిస్తున్నాయి. కొందరు ఆమె కథలో కీలకమైన పాత్ర పోషిస్తున్నారని చెబుతుండగా, మరికొందరు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా కనిపిస్తారని అంటున్నారు. మరోవైపు త్రివిక్రమ్ సినిమాల్లో రెండో హీరోయిన్‌కు కూడా ప్రాధాన్యత ఉంటుందనే అభిప్రాయం నేపథ్యంలో, ఆమెను సెకండ్ హీరోయిన్ పాత్ర కోసం ఎంపిక చేశారని కూడా టాక్ వినిపిస్తోంది.

ఇక ఈ వార్తలకు మరింత మసాలా జోడిస్తూ మరో ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే.. నివేదా పేతురాజ్‌ను ఈ సినిమాలో ప్రత్యేకంగా ఓ స్పెషల్ సాంగ్ కోసం తీసుకున్నారట. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఐటెం సాంగ్స్ ట్రెండ్ బాగా నడుస్తోంది. స్టార్ హీరోయిన్లు కూడా ప్రత్యేక గీతాల్లో నటించడానికి ముందుకొస్తున్నారు. దీంతో సినిమాకు అదనపు హైప్ రావడంతో పాటు, ఆ హీరోయిన్లకు కూడా కొత్త క్రేజ్ వస్తోంది. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ కూడా ఈ ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారని ఇండస్ట్రీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

సాధారణంగా త్రివిక్రమ్ సినిమాల్లో వచ్చే స్పెషల్ సాంగ్స్ క్లాస్ టచ్‌తో ఉంటాయి. కానీ ఈసారి వెంకటేష్ ఇమేజ్‌కు తగ్గట్టుగా పూర్తి మాస్ మసాలా సాంగ్‌ను ప్లాన్ చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆ పాటలో నివేదా గ్లామర్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని టాక్ నడుస్తోంది. అయితే దీనిపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మరో ఆసక్తికర అంశం ఏమిటంటే.. గతంలో 'అలా వైకుంఠపురంలో' సినిమాలో కూడా నివేదా పేతురాజ్ నటించారు. ఆ సినిమా తర్వాత మళ్లీ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఆమె కనిపించబోతుండటం విశేషంగా మారింది. ఇద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం కారణంగానే ఈ అవకాశం వచ్చిందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

ఇదిలా ఉంటే, వెంకటేష్-త్రివిక్రమ్ కలయిక కోసం అభిమానులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. త్రివిక్రమ్ రచయితగా.. నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి, వాసు వంటి సినిమాలకు అద్భుతమైన మాటలు అందించారు. అయితే.. ఇప్పుడు దర్శకుడిగా వెంకీతో సినిమా చేయడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్, ఎంటర్‌టైన్‌మెంట్ అంశాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా అక్టోబర్ విడుదల చేయాలని భావిస్తున్నారు. అయితే.. నివేదా నిజంగా కీలక పాత్రలో కనిపిస్తారా? లేక స్పెషల్ సాంగ్‌తో థియేటర్లలో సందడి చేస్తారా? అనే విషయాలపై స్పష్టత రావాలంటే మేకర్స్ అధికారిక ప్రకటన కోసం వేచి చూడాల్సిందే..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X