వకీల్ సాబ్: హీరోయిన్లలో ఆమెనే హైలైట్.. క్రేజీ అప్‌డేట్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండేళ్ల తర్వాత తిరిగి కెమెరా ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే 25 సినిమాలు పూర్తిచేసిన ఆయన తన 26వ సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చారు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో బాలీవుడ్ మూవీ 'పింక్' సినిమాకు రీమేక్‌గా ఈ సినిమా రూపొందుతోంది.
రాజు - శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమాకి, బోనీకపూర్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ మేజర్ పార్ట్ షూటింగ్ కూడా ఫినిష్ చేశారు. ఇటీవలే ఈ మూవీ ఫస్ట్ లుక్ విడుదల చేస్తూ సినిమా పేరు 'వకీల్ సాబ్' అని కన్ఫర్మ్ చేశారు మేకర్స్. ఈ లుక్ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.

ఇకపోతే ఈ 'వకీల్ సాబ్' సినిమాలో పవన్ సరసన నివేదా థామస్, అనన్య నాగేళ్ల, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే ఈ ముగ్గురు హీరోయిన్లలో నివేదా థామస్ రోల్ సినిమాకు హైలైట్ కానుందని తెలుస్తోంది. గతంలో ఏ సినిమాలో చూడని విధంగా ఆమె పాత్ర ఉండనుందని సమాచారం.
ఎమోషన్‌తో కూడిన సన్నివేశాల్లో నివేద కనిపిస్తుందని, ఈ పాత్రలో ఆమె జీవించేసిందని ఇన్‌సైడ్ టాక్. ఈ పాత్రకి నివేదా పూర్తి న్యాయం చేస్తోందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఈ రోల్ చూశాక ఆమెకు మరిన్ని అవకాశాలు తలుపుతట్టడం ఖాయం అని అంటున్నారు. ఏదేమైనా పవన్ రీ ఎంట్రీ సినిమాలో నివేదా థామస్‌కి చోటు దక్కడం ఆమె అదృష్టమే!.


Click it and Unblock the Notifications











